Health Care

బీర్ తాగేటప్పుడు ఏం తినాలో తెలుసా?


దిశ, ఫీచర్స్ : బీర్ అంటే యూత్‌కు చాలా ఇష్టం. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా లేదా బర్త్ డే పార్టీ అయినా సరే బీరు తాగుతుంటారు. అంతే కాకుండా స్నేహితులతో కలిసి కొంతమంది డైలీ ఒక బీర్ తాగడం తమ హాబీగా పెట్టుకుంటారు. అయితే ఈ బీర్ తాగే సమయంలో కొంత మంది మంచింగ్‌గా తీసుకుంటారు.అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను బీర్‌తో పాటు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట.అందువలన బీర్‌తో పాటు తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది బీర్‌తో పాటు ఎగ్ ఆమ్లెట్, పకోడీ, బజ్జీలు, చికెన్ ఫ్రైడ్ పీసెస్, మటన్ కర్రీ, పండ్లు లాంటివి తీసుకుంటారు. అయితే మసాలా ఎక్కువగా ఉన్న చికెన్, మటన్ లాంటివి బీర్‌తో తీసుకోకూడదంట. దీని వలన యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయంట.అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వాటిని కూడా బీర్‌ తాగేటప్పుడు తీసుకోకూడదంట.ఇందులో అధికంగా సోడియం ఉంటుంది. అందువల్ల బీర్‌తో వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు వైద్యులు. అందువల్ల ఎగ్ వైట్‌తో చేసిన పదార్థాలు, చేపలు, ఉడికించిన వేరుశెన, మొలకెత్తిన విత్తనాలు వంటికి బీరు తాగే సమయంలో మంచింగ్‌గా తీసుకోవాలంట.



Source link

Related posts

ఎండాకాలం కాళ్ళ పగుళ్లు సమస్య వేధిస్తోందా.. ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టండి!

Oknews

ఈ రెడ్ జ్యూస్ తో శరీరానికి నేచురల్ డిటాక్స్.. ఎలా తయారు చేయాలంటే..

Oknews

సముద్రంలో విహరిస్తూ ఆ పనిచేశారో అంతే సంగతులు.. ఆ దేశంలో ఏం చేస్తారంటే..

Oknews

Leave a Comment