Top Stories

బుల్లితెరపై సంక్రాంతి విజేత ఎవరు?


సంక్రాంతికి వెండితెరపై ఎంత హంగామా నడిచిందో మనందరం చూశాం. ఆ టైమ్ లో విజేతగా నిలిచిన సినిమా ఏంటో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే టైమ్ లో బుల్లితెరపై కూడా ఓ మోస్తరుగా సందడి కనిపించింది.

సంక్రాంతి వీక్ రేటింగ్స్ తాజాగా బయటకొచ్చాయి. బుల్లితెర సంక్రాంతిలో మ్యాడ్ సినిమా విజేతగా నిలిచింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఈటీవీ, సంక్రాంతి కానుకగా 15వ తేదీన ఈ సినిమాను ప్రసారం చేసింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా థియేటర్లలో సక్సెస్ అయిన ఈ మూవీ, 4.7 టీఆర్పీతో టీవీల్లో కూడా క్లిక్ అయింది.

అదే రోజు జెమినీ ఛానెల్ కూడా మరో సినిమాను టెలికాస్ట్ చేసింది. విజయ్ హీరోగా నటించిన లియో సినిమాను తొలిసారి ప్రసారం చేసిన జెమినీ టీవీకి కేవలం 3 టీఆర్పీ వచ్చింది. అలా సంక్రాంతి బరిలో లియో కంటే మ్యాడ్ మూవీకే ఎక్కువ ఆదరణ దక్కింది.

అటు జీ తెలుగు, స్టార్ మా ఛానెళ్లు సంక్రాంతి వార్ కు దూరంగా ఉన్నాయి. నిజానికి జీ తెలుగు ఛానెల్, భగవంత్ కేసరి సినిమాను వేస్తుందని అంతా అనుకున్నారు. అటు స్టార్ మా ఛానెల్ కూడా స్కంద సినిమాను దాదాపు రెడీ చేసింది. కానీ ఆఖరి నిమిషంలో ఆ రెండు ఛానెళ్లు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ వీకెండ్ టీవీల్లోకి వస్తున్నాయి.



Source link

Related posts

సెన్సార్ సర్టిఫికేట్ కోసం లంచం ఇచ్చిన హీరో

Oknews

చంద్రబాబు చేతగానితనం చాటి చెప్పిన సతీమణి!

Oknews

హ‌వ్వా.. న‌వ్విపోతున్నారు బాబు!

Oknews

Leave a Comment