దిశ వెబ్ డెస్క్: సాధారణంగా మనం రోజు తిరిగే ప్రాంతంలోనే అప్పుడప్పుడు బైక్‌లోనో, కారులోనో వెళ్తున్న సమయంలో కుక్కలు వెంటపడడం మనలో చాలా మంది చూసే ఉంటారు. రోజు చూస్తున్న వ్యక్తులను గుర్తుపట్టిన ఎందుకు కుక్కలు వెంటపడతాయి..? అవి మనల్ని శతృవులుగా భావించి అలా చేస్తాయా..? అనే అనుమానం మనలో చాలామందికి ఉంటుంది. అయితే కుక్కలు మనల్ని శతృవుగా భావించి వెంటపడతాయి అని అనడంలో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. మరి కుక్కలు వెంటబడడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాహనాల నుండి కుక్క వాసన రావడం..
కుక్కలు తమకంటూ ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అవి ఉన్న ప్రాంతంలోకి వేరే ప్రాంతం కుక్కలు వస్తే అసలు సహించవని.. పైగా తమ ప్రాంతం కుక్కను ఇతర ప్రాంతాల నుండి వచ్చి కుక్కను వాసన చూసి తెలుసుకుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే కొన్నిసార్లు పార్క్ చేసి ఉన్న వాహనాల టైర్‌పై ఏదైనా కుక్క మూత్ర విసర్జన చేస్తాయి. అలానే వాహనాన్ని తాకడం చేస్తాయి. అది మనం గమనించం.
ఈ నేపథ్యంలో మనం ఆ వాహనంలో వెళ్తే.. ఇతర కుక్కలు మన వాహనం నుండి వస్తున్న కుక్క వాసనను పసిగట్టి వాటి ప్రాంతంలోకి వేరే కుక్క వచ్చిందని భావించి వాహనాన్ని వెంబడిస్తాయని నిపుణులు అంటున్నారు.
అతి వేగం.. మితిమీరిన శబ్ధం..
అలానే మనలో కొంత మంది వేగంగా వెళ్తుంటారు. మరి కొంతమంది పెద్ధపెద్ధ శబ్ధాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ వేగానికి, శబ్ధానికి సైతం భయాందోళనకు గురైన కుక్కలు వాటి ప్రాణాలకు హాని జరుగుతుందేమోనని అరుస్తూ వాటిని అవి కాపాడుకోవడానికి వెంటపడతాయని నిపుణులు అంటున్నారు.
అలాంటి సమయంలో మనం అవి ఎక్కడ కరుస్తాయో అనే భయంతో వేగాన్ని మరింత పెంచి నడుపుతామని, ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుక్కలు వాహనాన్ని వెంబడించిన నేపథ్యంలో వాహనం వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్లాలని, ఇలా చేస్తే కుక్కలు వెనకడుగు వేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: సోషల్ మీడియాలో దొరికిన సమాచారం ఆధారంగా పై వివరాలు తెలపడం జరిగింది. దీనికి దిశ డైలీ.కామ్‌కు ఎలాంటి సంబంధం లేదు.