దిశ,వెబ్‌డెస్క్: ‘ప్రేమ’ ..ఈ రెండు అక్షరాల ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రేమ అనేది ప్రపంచ నలువైపులా వ్యాపించి ఉంది. కచ్చితంగా ఏదో ఒక దానిపై మనకు ప్రేమ ఉంటుంది. లేదా వేరే మనుషుల పైన కూడా ప్రేమ ఉండవచ్చు. దీనికి ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇక అసలు విషయంలోకి వెళితే..చాలా మంది తమకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంటారు. ప్రేమించిన మొదట్లో ఎంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ ఇద్దరి మధ్య ఎంతో నమ్మకంతో పెనవేసుకుంటుంది. కానీ ఈ ప్రేమ బంధంలో అనుమానం అనే పెను భూతం వల్ల చాలా మంది బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఐతే ఇలా బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఎక్కువగా బాధపడేది అమ్మాయా.. అబ్బాయా? అని బ్రిటన్‌కు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయన చేశారు.
ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే బాధ పడుతున్నట్లు ఈ సర్వే తేల్చి చెప్పింది. ఈ బాధను అమ్మాయిలు తమ స్నేహితులతో పంచుకుంటారు కానీ అబ్బాయిలు చెప్పుకోరంట. బ్రేకప్ బాధను అబ్బాయిలు తమలో తామే అనుభవిస్తూ తమ ప్రేయసిని తలుచుకుంటారని తేలిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు చాలా మంది ఇద్దరి మధ్య నమ్మకం లేక విడిపోతున్నట్లు తెలిపారు. తమ ప్రియురాలు మరో అబ్బాయితో వెళ్తుందేమోనన్న అనుమానంతో కొందరు, బ్రేకప్ అయ్యాక మరికొందరు మానసిక ఒత్తిడి లోకి వెళ్లినట్లు కూడా చెప్పారంట. ఇక ఫైనాల్లి బ్రేకప్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా బాధ పడుతున్నారని ఈ సర్వే తెలిపింది.
Read More : ఇటు తల్లి.. అటు మామ, కూతురు,భర్త.. అందరి మధ్యలో నలిగిపోతున్న మహిళ