ByGanesh
Sun 25th Feb 2024 02:52 PM
యూట్యూబర్ షణ్ముఖ్ రీసెంట్ గా గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటికొచ్చాడు. సోదరుడు సంపత్ ని అరెస్ట్ చేసేందుకు ప్లాట్ కి వెళ్ళిన పోలీసులకి దురదృష్టవశాత్తు షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. కానీ షణ్ముఖ్ లాయర్ మాత్రం షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించడం వలనే జైలుకెళ్లాడు, పోలీసులు అరెస్ట్ చేసారు, అంతేకాని గంజాయి సేవించలేదు అని చెప్పారు. తాజాగా షణ్ముఖ్ లవ్ లో బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లడంటూ ఓ లాయర్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది.
బిగ్ బాస్ లోకి వెళ్ళిన షణ్ముఖ్ అక్కడ సిరితో స్నేహం పేరుతొ ముద్దులు హగ్గులు ఇవ్వడం హాట్ హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక షణ్ముఖ్ ప్రవర్తన నచ్చక ఆయన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత షణ్ముఖ్ చాలా రోజులు ఎవరికీ కనిపించలేదు. మళ్ళీ ఈ కేసుతో బాగా ఫేమస్ అయ్యాడు.అయితే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జన్యూన్ గానే ఉన్నా సిరి అతని ఫ్రెండ్ షిప్ ని వాడుకుంది, అతన్ని వాడుకుని ఆమె తర్వాత తన లైఫ్ లో బాగానే ఉంది. కానీ లవ్ లో బ్రేకప్ అవడంతో షణ్ముఖ్ మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లడంటూ ఆ లాయర్ షణ్ముఖ్ గురించి నిజాలను బయటపెట్టింది.
కొన్నాళ్ళపాటు డిప్రెషన్ లో ఉన్న షణ్ముఖ్ మళ్ళీ ఇప్పుడిప్పుడే తన కేరీర్లో బిజీ అవుతున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మరి నిజంగానే షణ్ముఖ్ ఫ్రెండ్ షిప్ ని వాడుకుని బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అయ్యిందా? ఆ లాయర్ అన్నట్టుగా హౌస్ నుంచి బయటికొచ్చాక షణ్ముఖ్ మానాన అతన్ని వదలేసి సిరి తన బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అయ్యిందా అంటూ నెటిజెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.
Shanmukh who went into depression after the breakup:
Shanmukh – Sadness vs Depression