డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రాజమండ్రికి చెందిన దంపతులు పవన్‌కళ్యాణ్‌ను కలిసేందుకు వచ్చారు. ఆయన్ని కలుసుకోవడానికి వీలు పడకపోవడంతో దగ్గరలోని ఓ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
రాజమండ్రి వాస్తవ్యులైన ఈ దంపతులకు సంబంధించిన 1200 గజాల స్థలాన్ని ఓ మహిళా కార్పొరేటర్‌ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కబ్జా చేశారని, దాని గురించి ఫిర్యాదు చేసేందుకు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈరోజు పవన్‌కళ్యాణ్‌ని కలిసేందుకు వచ్చినా పోలీసులు అడ్డుకోవడంతో ఆ మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.