ట్రాఫిక్ ఆంక్షలు షురూశ్రీరామనవమి(Srirama Navami) ఉత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17 తేదీల్లో భద్రాచలం విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు, ఇతర పెద్ద వాహనాలను పట్టణంలోకి రాకుండా ఆంక్షలు(Traffic Restrictions) విధించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. భారీ గూడ్స్ వాహనాలు అత్యవసరమైతే తప్ప పట్టణంలోకి రాకుండా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాలని తెలిపారు. సీతారాముల కల్యాణం(Seetharamula Kalyanam), పట్టాభిషేకం(Pathabhishekam) కార్యక్రమాల సందర్భంగా మిథిలా స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున్నారు. రెండు రోజుల పాటు భద్రాచలం(Bhadrachalam) పట్టణానికి విచ్చేసే భక్తులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Source link