రూ.27 కోట్ల గంజాయిదహనం చేసిన నిషేధిత గంజాయి విలువ అక్షరాలా 27 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్ రోహిత్ రాజు తో పాటు కమిటీ సభ్యులైన ఓఎస్డీ సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, పాల్వంచ డీఎస్పీ వెంకటేష్, మణుగూరు డీఎస్పీ రాఘవేందర్రావు ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిషేధిత గంజాయిని ఉదయం నుంచి దశల వారీగా విభజించి దహనం చేశారు. ముందుగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ లో తూకం వేసి పరిశీలించారు. అనంతరం దహనం చేయడం కోసం సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టారు. చుట్టు పక్కల ఎలాంటి గ్రామాలు, నివాసిత ప్రదేశాలు లేకుండా జాగ్రత్త పడ్డారు.
Source link