ఈసీకి లేఖతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఈ అంశంపై లేఖ రాశారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పిస్తుందని, ఎన్నికల నిబంధన పేరుతో ఈ అవకాశానికి అడ్డు తగలవద్దని లేఖలో పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవించడం అందరి బాధ్యత అని, ఎన్నికల సంఘం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే సీఈవో వికాస్ రాజ్ నుంచి ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతించని పక్షంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు టీవీల్లో(Seetharamula Kalyanam TV Live) వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు.
Source link
previous post