‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ వంటి హారర్ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని ఏర్పరుచుకున్నారు పన్నా రాయల్. మార్చి 1న రిలీజ్ అవుతున్న ‘ఇంటి నెం.13’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిఫరెంట్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో పన్నా రాయల్ హ్యాట్రిక్ కొడతారని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.
రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదల్కెన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. డిఫరెంట్‌గా ఉన్న ట్కెటిల్.. అంతే డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్ ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మార్చి 1న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘ఇంటి నెం.13’ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను దర్శకుడు పన్నారాయల్ వివరిస్తూ ‘‘హారర్ జోనర్‌లో ‘ఇంటి నెం.13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది. టెక్నికల్ వేల్యూస్ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్ అని చెప్పొచ్చు. ఈ తరహా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో విజువల్ ఎఫెక్ట్స్ చేయించాం. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ వినోద్ యాజమాన్య మ్యూజిక్. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాడు. మేం అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నిస్తుంది’’ అన్నారు.
నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ ‘‘పన్నా నాకు ఏద్కెతే చెప్పారో దాన్ని యాజిటీజ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. అతని గత చిత్రాలను ఎంత బాగా తీసారో వాటిని మించేస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1న ఈ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.