బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు సినిమాల్లోనూ విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ సిల్వర్ స్క్రీన్‌పై హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఆమె చేసిన ప్రతి క్యారెక్టర్‌కి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ‘పెదకాపు 1’లో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమా విశేషాల గురించి తెలియజేస్తూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసింది అనసూయ.
‘‘శ్రీకాంత్ అడ్డాల అంటే మనకు గుర్తొచ్చేవి సెన్సిబుల్ మూవీస్. కానీ, ఇలాంటి యాక్షన్ సినిమా కూడా తీస్తారని అనుకోలేదు. పెదకాపు కథ విని ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది. కానీ, నేను కులాల గురించి పెద్దగా పట్టించుకోను. అంతెందుకు నా భర్త కులం ఏమిటో పెళ్ళి అయ్యే వరకు నాకు తెలీదు. ఆయనతో నేను ఎనిమిదేళ్ళు రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ఆ సయమంలో మా మధ్య కులాల ప్రసక్తి అస్సలు రాలేదు. మా పెళ్ళి ఫిక్స్ అయ్యే వరకు కూడా తెలీదు. చివరికి మా పెళ్ళి పత్రిక ఓ పంతులుగారు రాసే వరకు ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవారని తెలీదు. ఈ విషయం మా మధ్య ఎప్పుడూ డిస్కషన్‌కి రాలేదు. కేవలం ఫుడ్, సినిమాలు, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మాట్లాడుకొనే వాళ్లం.