దిశ, ఫీచర్స్: పండ్లలన్నింటిలోకెళ్లా మహారాజుగా పేరు పొందిన మామిడి పండు రుచే వేరు. దాదాపు ప్రతి ఒక్కరూ మామిడి పండును ఎంతో ఇష్టంగా తింటారు. ఎండాకాలంలో లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో అనేక రకాల పోషకాలుంటాయి. ఎండలో అలసిపోయినట్లుగా అనిపిస్తే మామిడి పండ్ల రసం తీసుకుంటే వెంటనే ఉత్సాహాన్ని ఇస్తుంది.
మామిడి జ్యూస్ ఒక రుచికరమైన, పోషకాలతో నిండిన పానీయం. ఇది వేసవిలో చల్లగా తాగడానికి ఒక అద్భుతమైన ఎంపిక. మామిడిలోని పదార్థాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి. మ్యాంగోలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియకు మంచిది. ఇన్ని ప్రయోజనాలున్న మామిడి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడి పండ్ల జ్యూస్ తయారీ విధానం:
ముందుగా మామిడి పండ్లను ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి రసం తీయాలి. రుచికి అనుగుణంగా చక్కెర వేసుకోవాలి. టేస్ట్ మరింతగా రావాలంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పాలు లేదా కాస్త వాటర్ ను కూడా కలపవచ్చు. అనంతరం 10 నిమిషాలు పాటు ఫ్రిజ్ లో పెట్టి తీసి తాగితే అలసట నుంచి విముక్తి పొందుతారు. రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలాగే మామిడి పండ్ల జ్యూస్‌ను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో కూడా తాగవచ్చు. మార్నింగ్ సమయంలో తాగితే మరింత యాక్టివ్ గా ఉంటారు.