Entertainment

భారతదేశాన్ని తిట్టిందని సింగర్  చిన్మయి మీద కేసు వేసిన స్టూడెంట్    


సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి శ్రీపాద సంపాదించిన పేరు అంతా ఇంతా కాదు. మూవీ లవర్స్ లో ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఆమెకి ఉంది. సమంత సినీ ఎదుగుదలలో కూడా ఆమె పాత్ర ఉందని చెప్పుకోవచ్చుఏ మాయ చేసావా నుంచి సమంత చేసే అన్ని సినిమాలకి చిన్మయే తన గళాన్ని ఇస్తుంది. తేనెలూరే ఆ గళం  సామ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యి ఆమెని ప్రేక్షకులకి దగ్గర చేసింది.అలాంటి  చిన్మయి మీద ఇప్పుడు పోలీసు కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తుంది.

తాజాగా జరిగిన  ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ సీనియర్ నటీ అన్నపూర్ణ  ఆడవాళ్ళ గురించి  కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఆడవాళ్ళ మీద జరిగే దారుణాలు ఆగాలంటే వాళ్ళ వస్త్ర ధారణ కూడా బాగుండాలని చెప్పింది. దీంతో ఆ వ్యాఖ్యలకి కౌంటర్ గా  చిన్మయి ఒక వీడియో చేసింది.  ఆ వీడియోలో భారతదేశం ఒక స్టుపిడ్ కంట్రీ అంటు మాట్లాడింది.దీంతో పలువురి నుంచి  చిన్మయి పై  విమర్శలు వస్తున్నాయి.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన స్టూడెంట్ ఒకరైతే ఏకంగా ఆమె పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. భారతదేశాన్ని చిన్మయి  అవమానించిందని తక్షణమే ఆమె మీద చర్యలు తీసుకోవాలని గచ్చి బౌలి పిఎస్ లో కేసు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 80 చిత్రాలకి పైనే చిన్మయి డబ్బింగ్ చెప్పింది. సమంత తో పాటు కాజల్, లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమ పరమేశ్వరన్, త్రిష లాంటి నటీమణులు  ఆమె అందించిన స్వరంతోనే ప్రేక్షకులకి దగ్గరయ్యారు. రీసెంట్ గా సీతారామం, హాయ్ నాన్న ల్లో మృణాల్ కి కూడా తనే చెప్పింది. సింగర్ గాను లెక్కకు మించి  ఎన్నో అధ్బుతమైన పాటలు పాడింది. ప్రతి పాట అమృతాన్ని కురిపిస్తుంది.ప్రముఖ నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చిన్మయి భర్తనే .

 



Source link

Related posts

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చేస్తున్న సినిమాలో నాని హీరో!

Oknews

ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

దేవర నయా అప్ డేట్.. నేను రెడీ మీరు రెడీ నా

Oknews

Leave a Comment