విశ్వ కధానాయకుడు కమల్ హాసన్ (kamal haasan) మొన్న పన్నెండవ తారీఖున భారతీయుడు 2(bharateeyudu 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. సుమారు 250 కోట్లతో తెరకెక్కగా కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఆ బాధనంతా దిగమింగుకొని కల్కి కలెక్షన్స్ ల గురించి తనదైన శైలిలో స్పందించాడు.
తాజాగా కమల్ ఒక వీడియో విడుదల చేసాడు. అందులో మాట్లాడుతు కల్కి(kalki)కలెక్షన్స్ లు వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు, మూడు వందలు, నాలుగు వందలు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఇలా చివరకి వెయ్యి కోట్ల వరకు సాధించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.ఈ కలెక్షన్స్ ఇంతటితో ఆగవు. మరిన్ని కలెక్షన్లు వస్తాయి.మూవీ బాగా రావడం కోసం టీం మొత్తం చాలా కష్టపడ్డాం. అదే విధంగా ప్రభాస్, అమితాబ్, దీపికా వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు .అదే విధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.
నాగీ చాలా కష్టపడి తెరకెక్కించాడు. తన విజన్ తో ఒక అధ్బుతాన్నే సృష్టించాడు. ఆయన్ని చూస్తుంటే దర్శక శిఖరం సింగీతం శ్రీనివాస్ ని చూసినట్టుగా ఉంది. నెక్స్ట్ పార్ట్ లో నా క్యారక్టర్ చాలా ఎక్కువగా ఉంటుందని తప్పకుండా మీ అందర్నీ అలరిస్తుందని కూడా చెప్పాడు. నాకు డబ్బులు కంటే అలాంటి క్యారెక్టర్స్ కిక్ ని ఇస్తాయని తెలిపాడు. ఇప్పుడు కమల్ చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చాలా మంది కమల్ ఫేస్ లో భారతీయుడు డిజాస్టర్ గా నిలిచిందనే బాధ స్పష్టంగా కనపడుతుందని, అయినా సరే కల్కి గురించి చాలా గొప్పగా మాట్లాడాడని అంటున్నారు.