Telangana

భార్యతో మనస్పర్థలు, నాంపల్లి ఎక్సైజ్ కోర్టు జడ్జి ఆత్మహత్య-nampally excise court judge died by suicide family issues with wife ,తెలంగాణ న్యూస్



తెలంగాణ న్యాయమూర్తుల సంఘం నివాళులునాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఎక్సైజ్ మేజస్ట్రేట్ మణికంఠ(Nampally Court Judge Dies)కు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, పలువురు న్యాయమూర్తులు నివాళులర్పించారు. 2016లో అతి పిన్న వయసులో న్యాయమూర్తిగా ఎంపికైన మణికంఠ గతంలో ఆలేరు, ప్రస్తుతం హైదరాబాద్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరు పొందిన మణికంఠ సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగుల మన్ననలను పొందారు. మంచి భవిష్యత్తు కలిగిన యువ న్యాయమూర్తి మణికంఠ మానసిక వత్తిడికి గురై నిన్న ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. సోమవారం అంబర్ పేటలోని మణికంఠ ఇంటికి వెళ్లిన పలువురు న్యాయమూర్తులు, న్యాయమూర్తి సంఘం ప్రతినిధులు మణికంఠ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు మణికంఠ తల్లిదండ్రులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు.



Source link

Related posts

Bangladesh Kabaddi Coach: బంగ్లాదేశ్‌ కబాడ్డీ కోచ్‌‌గా సంగారెడ్డి ఆటగాడు

Oknews

TS Inter Hall Ticket 2024 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు

Oknews

New Twist in the Hyderabad Honeytrap Case Mother and Daughter Involved in many Case

Oknews

Leave a Comment