Top Stories

భార్యా, పిల్ల‌ల్ని చంపి…తానూ!


క‌డ‌ప న‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. భార్యా, ఇద్ద‌రు పిల్ల‌ల్ని రివాల్వ‌ర్‌తో కాల్చి, తానూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడో హెడ్ కానిస్టేబుల్‌. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌కు కుటుంబం యావ‌త్తు బ‌లైంది. పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. క‌డ‌ప కోఆప‌రేటివ్ కాల‌నీలో హెడ్ కానిస్టేబుల్ వెంక‌టేశ్వ‌ర్లు (50) త‌న భార్య మాధ‌వి, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో నివాసం ఉండేవారు. ఈయ‌న క‌డ‌ప టూటౌన్ పీఎస్‌లో రైట‌ర్‌.

గ‌త రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ కూడా అత‌ను స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తించాడు. అనంత‌రం ఇంటికెళ్లాడు. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని, భార్య‌ని రివాల్వ‌ర్‌తో కాల్చి చంపాడు. అనంత‌రం తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇదంతా అత‌ను ప‌క్కా ప్ర‌ణాళిక‌తో చేసుకున్న‌ట్టు సూసైడ్ నోట్ చెబుతోంది. క‌డ‌ప ఎస్పీతో పాటు ఎర్ర‌ముక్క‌ప‌ల్లి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజ‌ర్‌కు కూడా ప్ర‌త్యేకంగా లేఖ‌లు రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

క‌డ‌ప ఎస్పీకి రాసిన లేఖ‌లో త‌న మ‌ర‌ణానంత‌రం వ‌చ్చే బెనిఫిట్స్‌ని, ఉద్యోగాన్ని త‌న రెండో భార్య ర‌మాదేవికి ద‌క్కేలా చేయాల‌ని అభ్య‌ర్థించాడు. ఎందుకంటే త‌న మొద‌టి భార్య, పిల్ల‌లు చ‌నిపోయార‌ని ప్ర‌త్యేకంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. రెండో భార్య క‌డ‌ప న‌గ‌రంలోని రాజారెడ్డి వీధిలో ఉంటుంద‌ని, ఆమె సెల్ నంబ‌ర్ కూడా అందులో పేర్కొన్నాడు.

అలాగే ఎస్‌బీఐ మేనేజ‌ర్‌కు రాసిన లేఖ‌లో త‌న బినామీ అయిన మొద‌టి భార్య మాధ‌వీ చ‌నిపోవ‌డం వ‌ల్ల, త‌న ఖాతాలో ఉన్న డ‌బ్బంతా రెండో భార్య ర‌మాదేవికి చెందుతుంద‌ని అగ్రిమెంట్ ప‌త్రం రాయ‌డం గ‌మ‌నార్హం. అలాగే పులివెందుల మండ‌లంలోని ఉలిమెళ్ల గ్రామంలో ఉన్న 1.28 ఎక‌రాల భూమిని ర‌మాదేవికి విక్ర‌యించిన‌ట్టు ద‌స్తావేజులున్నాయి. ఇక్క‌డ ర‌మాదేవిని నాగేశ్వ‌ర‌రెడ్డి భార్య‌గా చూపారు. ఈ కేసులో లోతైన విచార‌ణ చేస్తే వాస్త‌వాలేంటో బ‌య‌ట‌ప‌డ‌తాయి.



Source link

Related posts

బాల‌కృష్ణను ‘ఐ డోంట్ కేర్’ అంటున్న ఎల్లో మీడియాధిప‌తి!

Oknews

మాగుంట‌పై ప్రేమా? మ‌రెవ‌రినైనా అడ్డుకునే వ్యూహ‌మా?

Oknews

రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సెన్సార్ పూర్తి

Oknews

Leave a Comment