పవన్ సంకల్పంతోనే టీడీపీ, బీజేపీ పొత్తు
అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ బలంగా సంకల్పించకపోతే ఇవాళ బీజేపీ, టీడీపీ (TDP BJP)కలిసేవి కాదన్నారు. పవన్ కల్యాణ్ కమిట్మెంట్, జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ నీతి నిజాయతీలతో రాజకీయం చేసే నాయకుడు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలని తపన ఆయనలో కనిపిస్తుందన్నారు. పవన్ మాటలు తనలో స్ఫూర్తి నింపాయని, అందుకే జనసేనలో చేరానన్నారు. రాష్ట్రం నుంచి రాక్షస పాలనను తరిమికొట్టాలంటే అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ మూడు పార్టీల పొత్తుకు ప్రధాన కారణం పవన్ కల్యాణ్ వివరించారు. భీమవరంలో ఐదేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారని రామాంజనేయులు ఆరోపించారు.