దిశ, ఫీచర్స్ : యాలకులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. భోజనం చేసిన తర్వాత రెండు యాలకులు తీసుకోవడం వలన జీర్ణక్రియ పని తీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా, ఇది ఉబ్బరం వంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
కడుపులో ఆమ్లాన్ని నివారిస్తుంది. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే యాలకులు ఇమ్మ్యూనిటీని పెంచుతాయి.
యాలకులలో మెగ్నీషియం, కాల్షియం ఉన్నాయి. హాట్ వాటర్లో కలుపుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. గ్యాస్ సమస్యలను పరిష్కరించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లలకు పెట్టడం వలన వారి బోన్స్ గట్టిగా అవుతాయి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. యాలకులు శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది.