Top Stories

మంచు విష్ణు సినిమాలో మరో సూపర్ స్టార్


తన కలల ప్రాజెక్టు కన్నప్పలో సూపర్ స్టార్స్ నటిస్తారని ఇప్పటికే ప్రకటించాడు మంచు విష్ణు. చెప్పినట్టుగానే మినిమం గ్యాప్స్ లో పెద్దపెద్ద స్టార్స్ ను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రభాస్ ను తీసుకున్నారు. ఇప్పుడు మరో సూపర్ స్టార్ వచ్చి చేరాడు. అతడు మరెవరో కాదు, మోహన్ లాల్.

మల్లూవుడ్ సూపర్ స్టార్, ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, కన్నప్పలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. దీనికి సంబంధించిన మోహన్ లాల్ తో దిగిన ఫొటోను ఆయన షేర్ చేశాడు. కన్నప్ప సినిమాలో శివుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఇక మోహన్ లాల్ ను ఏ పాత్ర కోసం తీసుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఈ సినిమాలోకి స్టార్ హీరోయిన్ నయనతారను కూడా తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. ప్రభాస్ సరసన పార్వతి పాత్రలో నయనతార నటించే ఛాన్స్ ఉందంటూ కథనాలు కూడా వచ్చాయి. దానిపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో మోహన్ లాల్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించాడు విష్ణు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రాఫ్ట్స్ నుంచి 600 మంది ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో నుపూర్ సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకుంది. ఆ స్థానంలో హీరోయిన్ కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. ఇటు నయనతార ఎంట్రీ లేదా అటు విష్ణు సరసన నటించబోయే హీరోయిన్ పేరును త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.



Source link

Related posts

డ్రగ్స్ కేసు.. నవదీప్ కు నోటీసులు

Oknews

వైసీపీ పెత్తందారులను దూరం పెడ‌తారా?

Oknews

రెండు కుటుంబాలకు ఒకేసారి టీడీపీ షాక్…!

Oknews

Leave a Comment