దిశ, ఫీచర్స్: ఎండలు మండిపోతున్నాయి. మనుషులతోపాటు పశుపక్ష్యాదులు నీటి కోసం తపిస్తున్నాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.అయితే శిశువులు కూడా ఇంతే దాహార్తితో ఉంటారా? పాలతోనే దప్పిక తీర్చుకుంటారా లేక అదనపు నీరు అవసరమా? ఆరు నెలల లోపు పిల్లలకు ఒక్క వాటర్ డ్రాప్ కూడా తాగించొద్దని డాక్టర్స్ సూచిస్తారు కదా మరి మండే ఎండల్లో కూడా అదే ఫాలో కావాలా? అనే ప్రశ్నలు న్యూ మామ్స్‌లో తలెత్తుతుండగా.. వాటన్నింటికి సమాధానమిస్తున్నారు నిపుణులు.
* హాట్ సమ్మర్‌లో పెద్దలకే అధిక దాహం వేస్తుంది. కాబట్టి పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతారని అనుకుంటాం. కానీ వారికి సరిపోయే న్యూట్రిషన్ అండ్ వాటర్ కంటెంట్ తల్లి పాలు లేదా ఫార్ములా ఫీడింగ్‌లోనే లభిస్తాయి.
* ఆరు నెలల కన్నా తక్కువ వయసున్న పిల్లల పొట్ట పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వారికి మనం నీళ్లు తాగిస్తే కడుపు నిండిపోతుంది. కాబట్టి తక్కువ పాలు తాగుతారు. దీంతో వారి పెరుగుదల, బరువుపై ప్రభావం చూపుతుంది.
* నిజానికి సిక్స్ మంథ్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న బేబీ బాడీ ఇంత పెద్ద మొత్తంలో నీటిని ప్రాసెస్ చేసేందుకు రెడీగా ఉండదు. వారి కిడ్నీస్ మెచ్యూర్‌గా లేకపోవడం వల్ల ఇది సాధ్యపడదు.
హైడ్రేటెడ్‌గా ఎలా ఉంచాలి?
* బేబీస్ కోరుకున్నప్పుడు కచ్చితంగా పాలు ఇవ్వండి. ఎన్నిసార్లు డిమాండ్ చేస్తారో అన్నిసార్లు ఇవ్వడం వల్ల వారి బాడీలో ప్రాపర్ వాటర్ కంటెంట్ మెయింటెన్ అవుతుంది.
* ఇక పిల్లలు పడుకున్న చోట కూల్‌గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే వేడి కారణంగా బాడీ నుంచి చెమట బయటకు పోయిడీహైడ్రేట్ అయిపోతారు.