MP Navneet Kaur : మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజాకు పలువులు ప్రుముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ … మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ… ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా మంత్రి రోజాకు అండగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించిన ఆమె… ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారని, కానీ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయన్నారు. నీకు రాజకీయాలు కోసం, సిగ్గులేకుండా ఇంతలా మాట్లాడతారా? అని నవనీత్ కౌర్ ధ్వజమెత్తారు.