టాలీవుడ్ లేడీ సూపర్ సింగర్ గీతా మాధురి, నందు జంట ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. గీతా మాధురి బిగ్ బాస్ కి కూడా వెళ్లి వచ్చింది. ఎలాంటి సాంగ్ పాడడంలో ఐనా కూడా గీతా మాధురి స్పెషలిస్ట్. ఆమె సాంగ్ పాడితే అది వైరల్ అవడం హిట్ కొట్టడం కచ్చితంగా జరగాల్సిందే. 2014లో గీతామాధురి నందు ప్రేమించి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 2019లో వీరికి దాక్షాయణి అనే ఒక పాప పుట్టింది. ఇక రీసెంట్ గా గీత మాధురి తన సెకండ్ ప్రెగ్నన్సీని కూడా ఆస్వాదించింది. కొన్ని రోజుల క్రితమే ఈమెకు ఘనంగా సీమంతం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్లకు ఒక అబ్బాయి పుట్టాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా జరిగిన సీమంతం వేడుకల్లో ఉదక శాంతి పూజలు కూడా చేసారు నందు అండ్ గీతా. వేదమంత్రాల మధ్య మంత్రం జలంతో ఉదకశాంతి పూజ చేశారు. ఈ పూజ కారణంగా ఇల్లంతా శుద్ధి అవుతుంది…అలాగే ఎలాంటి దోషాలు చీడపీడలు లేకుండా శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు అందిస్తుంది ఈ పూజ.
ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ లో ఎంతో ఫేమస్ ఐన సింగర్ గీతా మాధురి మాస్ అండ్ క్లాస్ సాంగ్స్ ని ఆలపించి అన్ని వర్గాల వారికి ఎంటర్టైన్ చేశారు. తన హస్కీ వాయిస్‌తో “మగాళ్లు వట్టి మాయగాళ్లే” అనే పాట ఓ రేంజ్ లో హిట్ కొట్టింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఎన్నో పాటలు పాడారు. సుమారు 1800కు పైగా పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఇక దాక్షాయణికి తమ్ముడు పుట్టాడు అంటూ ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ అంతా కూడా గీతామాధురి-నందుకు విషెస్ చెప్తున్నారు.