దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి.ఆడవారు, మగవారు ఇద్దరిలో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలా మంది ఐవీఎఫ్, ఐయూఐ, సరోగసి వైపు మొగ్గుచూపుతున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. ఒక జంటకు పిల్లలు పుట్టకపోతే అది మహిళ తప్పా? లేక అబ్బాయి తప్పుకూడా ఉంటుందా? మగవారిలో పిల్లలు పుట్టకుండా ఉండటానికి గల కారణాలు ఏంటీ? వారు ఏ వయసులో పిల్లలు కనాలి లాంటి విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
కొన్ని రోజుల క్రితం పెళ్లైన జంటకు పిల్లలు కలగడం లేదంటూ మహిళలనే ఎక్కువగా నిందించేవారు.కానీ ప్రస్తుతం రోజుల్లో అబ్బాయిల ప్రాబ్లం వలన కూడా ఎక్కువగా పిల్లలు కలగడం లేదు.దానికి ముఖ్య కారణం ఏజ్ బాగా పెరిగిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలు సరైస వయసులో పెళ్లి చేసుకోకపోయినా, పిల్లలు పుట్టరు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అబ్బాయిలు ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి? పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏదో ఇప్పుడు చూద్దాం.
పురుషులు సరైన వయసులో పెళ్లి చేసుకోకపోవడం వలన వారిలో సంతానోత్పత్తి తగ్గిపోతుందంట. వయసు పెరగడం వలన వారిలో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందంట, ఎందుకంటే 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో అంగస్తంభన ఎక్కువగా ఉండటం వలన సెక్స్ సామర్థ్యం పూర్తిగా తగ్గుతుందంట. వయసు పెరగడం వలన వీర్యం నాణ్యత కూడా తగ్గిపోతుంది. దీని వలన లైంగిక శక్తి తగ్గిపోయి, పిల్లలు కలగరంట. అంతే కాకుండా మనం తీసుకునే ఆహారం, పర్యవరణ కారకాల వలన కూడా పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. అందువలన పురుషులు సరైన వయసులో పెళ్లి చేసుకోవాలంట. 25 నుంచి 35 మధ్య పెళ్లి చేసుకోవడం వలన త్వరగా పిల్లలు పుడుతారని, పిల్లలు పుట్టడానికి కూడా ఆ ఏజ్ సరైనదని వైద్యులు చెబుతున్నారు. ( నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృ వీకరించలేదు.