Health Care

మటన్‌లో ఏ ఏ పార్ట్స్ దేనికి ఉపయోగపడుతాయి.. సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తాయంటున్న నిపుణులు


దిశ, ఫీచర్స్: మటన్ రుచిగా ఉండటమే కాకుండా మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉంటాయి. మటన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో B1, B2,B3, B9, B12, విటమిన్ E,K వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ మహిళలు మటన్ తింటే పుట్టబోయే పిల్లలకు న్యూరల్ ట్యూబ్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉంటాయి.

మటన్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. తద్వారా ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ.. స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్ టైంలో తలెత్తే పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హిమోగ్లోబిన్ లెవల్స్‌ను కూడా పెంచుతుంది. చికెన్ కంటే మటన్‌లోనే ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అందుకే మటన్‌ ప్రైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మటన్‌లోని ఒక్కో పార్ట్ మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తుందో నిపుణులు చెప్పిన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం..

మటన్ లివర్..

మటన్ లివర్ తింటే ఐరన్, కాపర్, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీ టెంపరేచర్‌ను అదుపులో ఉంచుతాయి. అలాగే మేక కాళ్లను కాల్చి దాన్ని జ్యూస్‌గా తయారు చేసి తాగినట్లైతే అంటు వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

మటన్ బోన్స్..

మటన్ బోన్స్ సూప్ కీళ్ల నొప్పులకు దివ్యమైన ఔషధం. ఎముకలను పులుసుగా వండుకుని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జీర్ణ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఎక్కువగా ఇది వృద్ధులు తీసుకుంటారు. మటన్ బోన్స్ హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచుతుంది. శరీరంలోని బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది.

మేక తలకాయ కూర..

మేక తలకాయలో ఐరన్, ఫాస్పరస్, ఓమేగా-3, ప్రోటీన్లు, విటమిన్ ఎ, బి12, డి, ఈ, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మేక తలను కాల్చి.. ముక్కలుగా చేసి వండుతారు. మేక తలకాయ కర్రీ తింటే బాడీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. పేగుల ఆగోగ్యానికి మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇనుము లోపం ఉన్న వారు తింటే రక్తహీనతను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, ఎముకల ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో క్యాన్సర్ నివారించడంలో, కళ్లు చురుగ్గా కనిపించడానికి మేక తలకాయ కర్రీ చాలా బాగా మేలు చేస్తుంది.



Source link

Related posts

మిథున రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోంది.. జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారంటే..?

Oknews

పచ్చిమిర్చి తింటే అందం పెరుగుతుందా.. దీనిలో వాస్తవమెంత?

Oknews

లైఫ్‌లో సక్సెస్ కావాలా.. ఇవి మరిచిపోవద్దు

Oknews

Leave a Comment