దాదాపు నెలరోజుల క్రితం అంటే జూలై 5న రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. ఆరోజు మొదలైన వీళ్ళ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న విషయం తెలిసిందే. లావణ్య, రాజ్ తరుణ్ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ వ్యవహారానికి టీవీ ఛానల్స్ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఏదైనా ముఖ్యమైన సమాచారమైతే తప్ప ఛానల్స్‌లో టెలికాస్ట్ చెయ్యడం లేదు. కానీ, యూ ట్యూబ్ ఛానల్స్ మాత్రం ప్రతి గంటకూ ఒక అప్‌డేట్ అన్నట్టుగా వీళ్ల ఇష్యూకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. తద్వారా రాజ్‌తరుణ్‌కి బోలెడంత పబ్లిసిటీ వస్తోందన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది.
చాలా కాలం తర్వాత రాజ్‌తరుణ్ తన సినిమా ప్రమోషన్ కోసం బయటికి వచ్చాడు. ‘తిరగబడర సామీ’ చిత్రానికి సంబంధించి జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లావణ్య అక్కడికి చేరుకొని రాజ్ తరుణ్‌ని కలిసే ప్రయత్నం చేసింది. దీంతో మీడియా ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. తన భర్తతో మాట్లాడాలంటూ ప్రెస్‌మీట్ దగ్గరకు వెళ్ళేందుకు ట్రై చేసింది. కానీ, పోలీసులు ఆమెకు సర్ది చెప్పి తిప్పి పంపించారు.
అంతటితో ఆగని లావణ్య నిన్న రాత్రి మాధాపూర్‌లో రాజ్ తరుణ్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి తన మనుషులతో కలిసి వెళ్లింది. ఆమె రాకను ముందే గమనించిన రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఫ్లాట్ బయటే నిలబడి ఎంతో సేపు లోపల ఉన్న వారిని పిలుస్తూ ఉండిపోయింది. తన దగ్గర పెరిగిన పెట్స్‌ని చూసేందుకు వచ్చానని చెబుతూ డోర్ కొడుతున్నప్పటికీ ఇంట్లోని వారు స్పందించలేదు. రాజ్ తరుణ్‌పైన, అతని తల్లిదండ్రులపైన కూడా పలు ఆరోపణలు చేస్తూ వారిని బయటికి పిలిచింది. ఎంతో సేపు అక్కడే వెయిట్ చేసిన లావణ్య ఎవరూ స్పందించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘ప్రెస్‌మీట్ దగ్గరకి వెళితే నా భర్తను కలవనివ్వలేదు. ఇంటికి వచ్చినా ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. ప్రెస్‌మీట్ అయిపోయిన తర్వాత మాల్వీ ఆమె దిగిన హోటల్‌కి వెళ్లిపోవాలి. కానీ, అతని ఇంట్లో ఉండడానికి రీజన్ ఏమిటి? ఇప్పుడు మాల్వీ తన ఇంట్లో వున్న చాలా వస్తువుల్ని రాజ్ తరుణ్‌తో 35 లక్షలు ఖర్చు చేయించి కొనుక్కుంది. ఇవన్నీ ఏమిటి?’ అంటూ ప్రశ్నించింది లావణ్య.
రాజ్ తరుణ్, లావణ్య వివాదం టాలీవుడ్ లో ఎంత చర్చనీయాంశంగా మారిందో అందరికి తెలిసిందే. లావణ్య మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ పైన చాలా ఆరోపణలు చేసింది. అలాగే అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ వ్యవహారం ఇలా సాగుతూనే ఉంది. చట్టపరంగా రాజ్ తరుణ్ తో న్యాయపోరాటానికి లావణ్య సిద్ధమైంది. చట్టపరిధిలో ఈ వ్యవహారం నడుస్తూ ఉండగానే లావణ్య మరల బయటకి వచ్చింది. తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో తిరగబడర సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ దగ్గరకి లావణ్య వచ్చి కాస్తా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది రాజ్ తరుణ్ ను కలవాలంటూ వచ్చిన లావణ్య.. తిరగబడర సామి మూవీ ప్రెస్ మీట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. నా రాజ్ తో మాట్లాడనివ్వండి. %Aశ్రీంశీ Rవaస% – ఫోటో స్టోరి: సారా టెండూల్కర్ సీతా కోక రూపం నా భర్తని నేను కలవాలనుకుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు. నా భర్తతో మాల్వీ ఎందుకు తిరుగుతుంది. ఇద్దరు కలిసి ఎందుకు ఉంటున్నారనేది నాకు సమాధానం చెప్పాలంటూ లావణ్య ప్రశ్నించింది. రాజ్ తరుణ్ ని కలిసి అన్ని విషయాలు అడుగుతానంటూ లావణ్య హడావిడి చేసింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే వాడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు. నోటీసులకి ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ లావణ్య మాట్లాడిరది. చట్టప్రకారం నేను న్యాయ పోరాటం చేస్తాను. %Aశ్రీంశీ Rవaస% – రాజాసాబ్.. ఓ సెంటిమెంట్ ఉంది! రాజ్ తరుణ్ నాకు కావాలి. అతని కోసం ఎంతవరకైనా ఫైట్ చేస్తానంటూ లావణ్య ప్రసాద్ ల్యాబ్స్ ముందు మీడియాతో మాట్లాడిరది. అయితే లావణ్య గందరగోళం సృష్టించడంతో పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. ఇక తాజాగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేసింది. అయితే రాజ్ తరుణ్ ఇంటి లోపల ఉన్న డోర్స్ ఓపెన్ చేయలేదు. చాలా సేపు అపార్ట్మెంట్ దగ్గర ఆమె వెయిట్ చేసింది. నా డాగ్స్ ని చూడటానికి వచ్చానని, అనుమతించాలని డిమాండ్ చేసింది. లావణ్యతో వివాదంపై రాజ్ తరుణ్ తిరగబడర సామి ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, వాటితో చట్టపరంగా ఫైట్ చేస్తానని తెలిపారు. ప్రతిసారి మీడియా ముందుకొచ్చి ఆమెపై ఆరోపణలు చేయాలని అనుకోవడం లేదంటూ రాజ్ తరుణ్ తెలిపారు.