భూకబ్జా ఆరోపణలుఈ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్(Bail) కోసం కన్నారావు రెండు సార్లు ప్రయత్నించారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ కు తిరస్కరించింది. కన్నారావు కోసం పోలీసులు ఇటీవల లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. కల్వకుంట్ల కన్నారావు(Kalvakuntla Kannarao)పై 147, 148, 447, 427, 307, 436, 506, r/w149 సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడ పరిధిలో 32 సర్వే నెంబర్ లో గల 2.15 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గత నెల 3న ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కల్వకుంట్ల కన్నారావు సహా 38 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Source link