Telangana

మరణంలోనూ వీడని స్నేహం, ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి-sangareddy tractor accident three friends died ,తెలంగాణ న్యూస్


Sangareddy News : ఒకే గ్రామానికి చెందిన వారు ముగ్గురు స్నేహితులు మూడు ట్రాక్టర్లు కొనుక్కున్నారు, కలిసి ట్రాక్టర్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదంలో ఆ ముగ్గురు స్నేహితులు ఒకేరోజు మరణించారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని కొలుకురు గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కొలుకురు గ్రామానికి చెందిన ఈటల రమణ (45), ఎంపల్లి మల్లేష్ (30), మంగలి గోపాల్ (30) ముగ్గురు తలా ఒక ట్రాక్టర్ కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈటల రమణకి చెందిన ట్రాక్టర్ ట్రాలీ టైర్ శనివారం రోజు పంక్చర్ అయింది. ఆ టైర్ ను గోపాల్ కు చెందినా ట్రాక్టర్ లో వేసుకొని సదాశివపేటలో పంక్చర్ వేయించడానికి ముగ్గురు కలిసి బయలుదేరారు. ఊరి చివర ఉన్న సింగూరు కాలువ మీదుగా సదాశివపేట పట్టణం వైపు వెళ్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి సింగూరు కాలువలో పడిపోయింది. అది పూర్తిగా బోల్తా పడటంతో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురు కూడా ఇంజిన్ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.



Source link

Related posts

కేబినెట్ విస్తరణ… నల్గొండకు మరో మంత్రి పదవి సాధ్యమేనా..?-will there be another chance in nalgonda district in telangana cabinet expansion ,తెలంగాణ న్యూస్

Oknews

Narendra Modi | Adilabad | ప్రధాని మోడీ మమ్మల్ని పట్టించుకోకపోతే.. ఇంకెవరు అభివృద్ధి చేస్తారు?

Oknews

హత్యలు, దందాలతో బెంబేలెత్తిస్తున్న మోస్ట్‌ వాంటెడ్ అరెస్ట్-arrest of most wanted criminal involved in murders and land grabs in hyderabad ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment