Top Stories

మరోసారి గడ్డం గ్యాంగ్ లో చేరిన హీరో


రా అండ్ రస్టిక్ సినిమాల పేరిట హీరోలంతా గుబురు గడ్డాలు, బుర్ర మీసాలు పెంచే సంస్కృతిని ఎప్పుడో మొదలుపెట్టారు. రంగస్థలం సినిమా కంటే ముందే ఇది మొదలవ్వగా, ఆ సినిమా నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం చిన్న-పెద్ద తేడా లేకుండా హీరోలంతా ఈ 'పెంచుడు' కార్యక్రమంలో ఉన్నారు. హీరో నాగచైతన్య కూడా ఇప్పుడీ లిస్ట్ లోకి మరోసారి చేరాడు.

ఎస్కేన్, సాయిరాజేష్ నిర్మాతలుగా ఈరోజు కొత్త సినిమా మొదలైంది. సంతోష్ శోభన్, అలేఖ్య హారిక ఇందులో హీరోహీరోయిన్లు. ఈ సినిమా ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు నాగచైతన్య. చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి కనిపించిన ఈ హీరో, తన లుక్ తో దాదాపు షాకిచ్చాడు.

ఇప్పటివరకు ఎన్నడూ పెంచనంత భారీగా గడ్డం పెంచాడు, లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఓ కొత్త లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇదంతా తన కొత్త సినిమా కోసమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. యదార్థ ఘటనల ఆధారంగా, సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకార గ్రామాన్ని కూడా సందర్శించాడు చైతూ. ఆ తర్వాత మర పడవలో సముద్రంలోకి కూడా వెళ్లాడు. అలా తన క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించిన నాగచైతన్య, ఇప్పుడు మేకోవర్ లో భాగంగా ఇలా తయారయ్యాడు.



Source link

Related posts

తిట్టడం వరకు ఓకే.. ప్రచారం చేయనంటే ఎలా?

Oknews

ఉత్తరాంధ్ర నుంచే అన్నా చెల్లెలు సమరం…!

Oknews

గుంటూరులో యాసిడ్ దాడి.. కానీ సీన్ రివర్స్

Oknews

Leave a Comment