GossipsLatest News

మరోసారి సింపతీ గేమ్ స్టార్ట్ చేసింది


సమంత యశోద విడుదల సమయంలో తనకి మాయోసైటిస్ ఉంది, తాను గనక సినిమాని ప్రమోట్ చెయ్యకపోతే సినిమా చచ్చిపోతుంది అని నిర్మాత అడగడంతోనే తాను తన వ్యాధిని బయటపెట్టాను, లేదంటే చెప్పేదాన్ని కాదు అంటూ తనని సింపతీ క్వీన్ అంటూ ట్రోల్ చేసిన వారికి రిప్లై ఇచ్చిన సమంత.. గ్లామర్ కూడా అభిమానుల కోసమే, తనకి పెద్దగా ఇలాంటివి చెయ్యడం ఇష్టం ఉండదు అని చెప్పడం ఇవన్నీ ఆమెని విమర్శలపాలు చేస్తున్నాయి. పాత్ర డిమాండ్ ని బట్టి గ్లామర్ చూపించాల్సి వస్తుంది, లేదంటే నాకూ ఇలాంటివి ఇష్టం ఉండవు అని చెప్పే సమంత  తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో అలాంటి గ్లామర్ ఫొటోస్ షూట్స్, అందాలు ఆరబొయ్యడమే పనిగా పెట్టుకుని, అలాంటివి చెబితే విమర్శించక ఏం చేస్తారు.

అదలా ఉంటే సిటాడెల్ సీరీస్ ని ఖుషి సినిమా ని ఓకె చేశాకే ఒప్పుకున్నాను, సిటాడెల్ సెట్స్ లో చాలాసార్లు నా ఆరోగ్యం పాడైంది, టీమ్ న్యూట్రీషియన్ ని పిలిచి నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు, సిటాడెల్ షూటింగ్ లో ఒకసారి నా ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవగా.. సిటాడెల్ టీమ్ మొత్తం టెన్షన్ పడింది, కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు తానూ చాలా ఇబ్బందిపడ్డానని చెప్పింది. అయితే ఈ సిటాడెల్ సీరీస్ లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిసినా ఒప్పుకున్నట్లు గా చెప్పుకొచ్చింది.

కానీ ఇప్పుడు సిటాడెల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ సమంత తన హెల్త్ విషయాలని పాడ్ కాస్ట్ ద్వారా తెలియజేస్తుంది. అయితే సమంత చెప్పడం కాదు గాని.. ఈమధ్యన అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేసిన సిటాడెల్ ప్రోమోలో యాక్షన్ సీన్స్ లో గన్ పట్టుకొని పోరాడే షాట్స్ లో సమంత నిజంగా చాలా కష్టపడినట్లుగా అనిపిస్తుంది. సమంత ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. 

అయితే తన సీరీస్ విడుదల సమయంలో మళ్ళీ సమంత హెల్త్ విషయాలపై ఓపెన్ అవడం పట్ల మరోసారి ఆమె సింపతీ గేమ్ స్టార్ట్ చేసింది అంటూ నెటిజెన్ మాట్లాడుకునేలా చేసింది.



Source link

Related posts

సూర్య వర్సెస్ సూర్య.. ‘కంగువ’ మూవీ స్టోరీ ఇదే…

Oknews

శర్వానంద్ మామూలోడు కాదు..పెద్ద రేస్ రాజా!  

Oknews

ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తున్న టాలీవుడ్‌.. వెలవెలబోతున్న బాలీవుడ్‌!

Oknews

Leave a Comment