EntertainmentLatest News

మల్టీటాలెంటెడ్‌ శ్రుతిహాసన్‌ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు!


లోక నాయకుడు కమల్‌హాసన్‌ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్‌ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల్లో నటించి లక్కీ హీరోయిన్‌ అనే పేరును సార్థకం చేసుకుంది. మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్‌ పుట్టినరోజు జనవరి 28. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కి చేరుకున్న శ్రుతి హాసన్‌ వివిధ రంగాల్లో ఆమె ప్రతిభ గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. 

2000 సంవత్సరంలో కమల్‌హాసన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హే రామ్‌’ చిత్రంలో బాలనటిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన శ్రుతి ‘లక్‌’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో సిద్ధార్థ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది. అందరికీ నటిగానే పరిచయమున్న శ్రుతి మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. సంగీతంలో ప్రావీణ్యం ఉంది, గాయనిగా ప్రవేశం ఉంది, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా తన ప్రతిభను చాటుకుంది. 

సినిమాల్లోకి రాకముందు ఆమెకు సంగీతమే ప్రపంచంగా ఉండేది. కాలిఫోర్నియాలోని మ్యూజిషియన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సంగీతం కోర్సు చేసింది. అంతేకాదు ఉన్నత చదువు అభ్యసించిన హీరోయిన్లలో శ్రుతి హాసన్‌ పేరును కూడా పేర్కొనవచ్చు. ముంబైలోని సెయింట్‌ ఆండ్రూస్‌ కాలేజీ నుండి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.

చిన్నతనంలోనే సంగీతంపై అభిరుచిని పెంచుకున్న శ్రుతి ఆరేళ్ళ వయసులోనే కమల్‌హాసన్‌, శివాజీ గణేశన్‌ ముఖ్యపాత్రల్లో 1992లో రూపొందిన ‘క్షత్రియ పుత్రుడు’ చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘మురిసే పండగ పూట..’ అనే పాట సెకండ్‌ వెర్షన్‌ను తమిళ్‌లో శ్రుతిహాసన్‌ పాడిరది. ఈ పాట ద్వారానే గాయనిగా పరిచయమైంది. మ్యూజిక్‌ వరల్డ్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌ను అందించింది. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రదర్శనలు కూడా ఇచ్చింది. తన తండ్రి నిర్మించిన ఉన్నైపోల్‌ ఒరువన్‌ (2009)తో సంగీత దర్శకురాలిగా పరిచయమైంది శ్రుతి. అప్పటి నుండి తన స్వంత సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎడిసన్‌ అవార్డ్స్‌లో ఉన్నైపోల్‌ ఒరువన్‌ కోసం ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా అవార్డును గెలుచుకుంది. ఇంగ్లీష్‌ చిత్రం ‘ఫ్రోజెన్‌2’ చిత్రానికి సంబంధించిన తమిళ్‌ వెర్షన్‌లో ఎల్సా క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెప్పి అందరి ప్రశంసలు అందుకుంది.

టెలివిజన్‌లో కూడా కొన్ని షోస్‌ నిర్వహించింది. హాసన్‌ 2018లో హలో సాగో అనే తమిళ షోలో హోస్ట్‌గా టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నీరా పటేల్‌ పాత్రలో ట్రెడ్‌స్టోన్‌తో అమెరికన్‌ టెలివిజన్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పలు శాఖల్లో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్న  శ్రుతిహాసన్‌ నిర్విరామంగా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఓ పక్క హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తూనే మ్యూజిక్‌ రంగంలో కూడా బిజీగా ఉంటోంది. 1992లో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శ్రుతి ఇప్పటివరకు దాదాపు 50కి పైగా సినిమాల్లో పాటలు పాడిరది. పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ను క్రియేట్‌ చేసింది. తన మల్టీ టాలెంట్స్‌తో కెరీర్‌ను కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శ్రుతిహాసన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.



Source link

Related posts

Pooja Hegde Half Saree Look పూజ హెగ్డే హాఫ్ శారీ లుక్

Oknews

Avinash Reddy vs Sharmila అన్న అవినాష్‌తో షర్మిల ఢీ.. అఫిషియల్!

Oknews

Fans Are Eagerly Waiting For This! పవన్ OG లో అదే హైలెట్ అంట

Oknews

Leave a Comment