EntertainmentLatest News

మళ్ళీ బాలకృష్ణ తన అభిమాని మీద ప్రేమ చూపించాడు


కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ(balakrishna)నేను ఎక్కడ ఉన్నా నా అనుకునే వాళ్ళు నా గుండెల్లో ఉంటారని  లెజండ్ సినిమాలో చెప్తాడు. అది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు. తన గుండె లోతుల్లో  నుంచి వచ్చిన నిజమైన మాట. అందుకు నిదర్శనంగా  తన అభిమానుల మీద ఎనలేని ప్రేమని  కురిపిస్తాడు. అభిమానులు కూడా బాలయ్య  ప్రేమ అమ్మ ప్రేమని మరిపిస్తుందని అంటారు.ఆ మాట నిజమని  మరోసారి రుజువయ్యింది.

బాలయ్య  తన 107 మూవీ షూటింగ్ ని ఇటీవలే ప్రారంభించాడు. ప్రస్తుతం  కర్నూల్ జిల్లా ఆదోని లో షూటింగ్ జరుగుతు ఉంది. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో  కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. దీంతో బాలయ్య అభిమానులు  పెద్ద సంఖ్యలో  అక్కడకి  చేరుకుంటున్నారు. వాళ్లలో  సజ్జద్ అనే అభిమాని ఒకడు. తన  ఫ్యామిలీ తో సహా బాలయ్య ని చూడటానికి  వచ్చాడు. ఆ సమయంలో తన ఏడేళ్ల బాబు కూడా  ఉన్నాడు. విషయం తెలుసుకున్న బాలయ్య వాళ్ళందరిని పిలిపించుకుని తన సొంత ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు. సజ్జద్ కొడుకుతో  నువ్వు చికెన్, తింటావా మటన్ తింటావా లేక ఫిషా  అని అడిగాడు. పిల్లోడు  మాత్రం ఫిష్ అని అన్నప్పుడు కొంచం పాజిటివ్ గా స్పందించాడు.  ఆ తర్వాత డైలీ ఎగ్ తినమని అలా తింటే చాలా బలమని చెప్పాడు. ఆ తర్వాత తన అభిమానితో కలిసి భోజనం కూడా చేసాడు. ఇప్పడు ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలయ్య ఫాన్స్ (balayya fans)అయితే  మా బాలయ్య  బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా బాలయ్య తన అభిమానుల మీద కోప్పడతాడు అనే వాళ్ళకి ఇదొక చెంప పెట్టు లాంటిదని కూడా అంటున్నారు. ఇక బాలయ్య  మొన్న జరిగిన  ఎలక్షన్స్ లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. అదే ఊపుతో తన 107 వ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. చిరంజీవి కి వాల్తేరు వీరయ్య తో  హిట్ ఇచ్చిన బాబీ (bobby)దర్శకుడు కావడంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.  బాబీ కూడా ఎంటైర్  బాలయ్య సినీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచిపోయేలా  తెరకెక్కిస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్థుతానికి అయితే  కొద్దీ రోజుల క్రితం విడుదలైన బాలయ్య గ్లింప్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

 



Source link

Related posts

వేశ్యల జీవితాలకి భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం ఉన్న సినిమా 

Oknews

పృథ్వీ తో జత కట్టిన సుమయ రెడ్డి..కథ, నిర్మాత కూడా ఆమెనే

Oknews

నటనకు మెగా కోడలు ఫుల్ స్టాప్ పెట్టేదేలే..

Oknews

Leave a Comment