GossipsLatest News

మస్క్ ట్వీట్.. జగన్‌కు పెరిగిన అనుమానం!


మస్క్ ట్వీట్.. జగన్‌కు పెద్ద డౌట్.. వాట్ నెక్స్ట్?

ఎన్నికల్లో వాడే EVM (Electronic Voting Machine) లపై ఎన్నో అనుమానాలు.. ఎందరో మేథావులు సందేహాలు వ్యక్తం చేసిన పరిస్థితి.! ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు, ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఈవీఎంలపై చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఇక మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. కేబినెట్‌ కూడా కొలువుదీరింది. నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెప్పిన అపర కుబేరుడు, టెస్లా అధిపతి, X ఓనర్ (ట్విట్టర్) ఎలాన్ మస్క్.. రోజుల వ్యవధిలోనే ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ పెను సంచలనమే అయ్యింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు.. మనం ఈవీఎంలను తొలగించాలి.. వాటిని వ్యక్తుల సాయంతో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అనేదే ఆ ట్వీట్ సారాంశం. ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి ఇండియాతో ఎలాంటి సంబంధాలు, ఇక్కడి పాలిటిక్స్‌ తెలియని వ్యక్తి ఒక్కసారిగా ఇలా ట్వీట్ చేయడంతో ఇప్పటి వరకూ పార్టీల అధిపతులు, సామాన్య ప్రజల్లో సైతం నెలకొన్న సందేహాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

పేపర్.. వైపు అడుగులు పడాలి!

వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ కాస్త నిశితంగా గమనిస్తే.. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా అని రాసుకొచ్చారు. అంతేకాదు.. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్‌ బ్యాలెట్లు వాడుతున్నారనే విషయాన్ని కూడా మాజీ సీఎం ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈవీఎంలు కాదు.. మనం కూడా పేపర్ బ్యాలెట్స్ ఇదే దిశగా ముందుకు కదలాలని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడం.. కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో మొదటి నుంచి ఆ పార్టీ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఒకవైపు వైసీపీ నేతలు మీడియా ముందు కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. అటు దేశ వ్యాప్తంగా కూడా ఈవీఎంల వ్యవహారంపై రచ్చ నడుస్తుండటంతో మరింత చర్చనీయాంశం అయ్యింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే జగన్ చేసిన ఈ ట్వీట్ మరింత హాట్ టాపిక్ అయ్యింది.

మొదట్నుంచీ సందేహాలే..!

ఈవీఎంలతో ఏమైనా చేయొచ్చు.. హ్యాక్ చేసి ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది..! ఎందుకు.. ఎలా అనేదానిపై చాలా మంది పెద్దలు, విశ్లేషకులు, న్యాయవాదులు సైతం వివరణ ఇచ్చారు. కేంద్రంలో గెలిచిన ఎన్డీఏ 140కి పైగా నియోజకవర్గాల్లో ఈవీఎంలు గోల్ మాల్ జరిగాయని సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ లాంటి మేధావులు సైతం ఆందోళన చెందుతూ మాట్లాడిన పరిస్థితి. అంత పెద్ద మనిషి ఇలాంటి సందేహాలు లేవనెత్తడంతో ఒక్కొక్కరుగా నోరు తెరవడం మొదలు పెట్టారు. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో శివసేనకు చెందిన రవీంద్ర వైకర్.. కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలను ఫోన్ ద్వారా అన్ లాక్ చేసినట్టు పక్కా ఆధారాలతో దొరికిపోవడం, ఆ తర్వాత సడన్‌గా ఏమైందో తెలియదు కానీ.. ఈ వార్త రాసిన సదరు దినపత్రిక తో దీనిపై సారీ చెప్పడం గమనార్హం. ఇలా ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌, అన్‌లాకింగ్‌‌పై ఒకింత యుద్ధమే జరుగుతోంది. అటు మస్క్.. ఇటు మేథావులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ మీడియా, సోషల్ మీడియా ముందుకు వస్తుండటంతో ఈవీఎంలపై పెద్ద విప్లవమే రాబోతోందని అర్థం చేసుకోవచ్చు.

ఏం జరుగుతుందో..?

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద ఎన్నికల స్కామ్ బయటపడబోతోందా..? లేదా రాజకీయ ఒత్తిడితో తొక్కేస్తారా? అని కొద్దిరోజులుగా చర్చ అంతకుమించి రచ్చే జరుగుతోంది.  ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయని విశ్లేషకులు సైతం చెబుతున్న పరిస్థితి. ఇందుకు కొన్ని ఆధారాలు సైతం జోడించి.. పట్టుమని పదిమంది కూడా లేకుండా రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం జరిగింది. అలాంటిది.. మూడు లక్షల ఇరవై వేల మెజారిటీతో గెలవడమే నమ్మశక్యం కావట్లేదని జనాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. మస్క్ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చింది కూడా ఈ చంద్రశేఖరే కావడం గమనార్హం. ఈ ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది కూడా. దేశం అంతా వీటి మీద చర్చ జరుగుతోందని.. న్యాయం ఎక్కడో ఒక చోట ఉంటుందని వైసీపీ కూడా పెద్ద ఆశలే పెట్టుకుంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి. మరోవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకూ అధికార, ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఇక ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. ఇందులో గెలిచి నిలిచేదెవరో.. అభాసుపాలయ్యేదెవరో చూడాలి మరి.



Source link

Related posts

CM Revanth Reddy Takes Sensational Decision on Nandi Awards ఇకపై నంది కాదు.. గద్దర్

Oknews

రాజమౌళి సినిమాలో విలన్‌గా విక్రమ్‌.. మహేష్‌కి జక్కన్న పెట్టిన కండిషన్‌ అదే!

Oknews

Samantha Visit Tiruchanur Sri Padmavati Temple అమ్మవారి దర్శనంలో సమంత

Oknews

Leave a Comment