మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి (vijay sethupathi)జూన్ 14 న వరల్డ్ వైడ్ గా మహారాజ(maharaja)గా ల్యాండ్ అయ్యాడు. పేరు కి తగ్గట్టే బాక్స్ ఆఫ్ ఆఫీస్ వద్ద మహారాజ గా నిలబడ్డాడు. ఆల్ సెంటర్స్ లో రికార్డు కలెక్షన్ల ని సాధిస్తున్నాడు. దీంతో సేతుపతి పేరు ఒక్కసారిగా మారుమోగిపోతుంది.
మహారాజ ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్లలో విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల కూడా ప్యూర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇందుకు నిదర్శనంగా తొలిరోజు పది కోట్ల రూపాయలని వసూలు చేసింది. ప్రీ సేల్స్ ద్వారానే దాదాపు నాలుగు కోట్లు రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సేతుపతి కట్ అవుట్ కి ఉన్న స్టామినా ఏంటో తెలిసొచ్చింది. ఏరియా వారి కలెక్షన్స్ వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకి రానున్నాయి.
కూతురు మీద ప్రేమ కలిగిన తండ్రి గా సేతుపతి నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. విలన్ గా చేసిన ప్రఖ్యాత బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటనకి కూడా మంచి పేరు వస్తుంది. మిగతా పాత్రల్లో చేసిన నటరాజన్ సుబ్రమణ్యం, మమతా మోహన్ దాస్, అభిరామి లు తమ పాత్ర పరిధి మేరకు చేసారు. నితిలన్ స్వామినాథన్ దర్శకుడు కాగా జగదీశ్ పళని స్వామి, సుదాన్ సుందరం నిర్మాతలు