Health Care

మహిళా దినోత్సవం మొదట ఎక్కడ, ఎలా మొదలైంది .. దాని ప్రాముఖ్యత ఏమిటంటే?


దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న నిర్వహించుకుంటారు. అయితే ఈ రోజున మహిళలను గౌరవించడం తో పాటుగా హక్కులు, మహిళలపై జరిగే హింస వంటి విషయాలపై చర్చించుకుంటారు. అంతేకాకుండా పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సామాజిక సంస్థలు, రాజకీయ రంగాల్లో మహిళలు రాణించడానికి పూర్తిగా శ్రమించేలా ప్రోత్సాహాన్ని అందిస్తారు. అసలు మహిళా దినోత్సవం ఎక్కడ మొదలైంది. ఈ రోజును జరుపుకోవడానికి గల కారణాలు అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? అనే దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

1908లో న్యూయార్క్ సిటీకి చెందిన 15 వేల మంది మహిళలు తమకు పని గంటలను తగ్గించాలని, పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, ఓటు వేసే హక్కును కల్పించాలని కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. ఆ ప్రదర్శన ఫలితంగా 1999లో జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఈ దినోత్సవం కేవలం ఒక దేశానికే చెందినది కాదని క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచించింది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల్లోని మహిళలకు చెందినదిగా ప్రకటించాలని పోరాటం చేసింది. 1910లో కోపెన్ హాగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కార్యక్రమంలో ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మార్చాలని డిమాండ్ చేసింది.

ఆ సదస్సులో పాల్గొన్న 100 మంది మహిళలు ఆమె డిమాండ్‌ను అంగీకరించారు. దీంతో తొలిసారి 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత చుట్టు పక్కల దేశాలు కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం స్టార్ట్ చేశాయి. కానీ ఐక్యరాజ్య సమితీ మాత్రం 1975లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అప్పటి నుంచి అన్ని దేశాలు కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి. అయితే దీని ముఖ్య ఉద్దేశం.. పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలి.. అలాగే సమానంగా జీతాలు విలువను ఇవ్వాలని దీని ప్రధాన ఉద్దేశం.

అయితే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతేకాకుండా పురుషుల కంటే ఎక్కువ మహిళలే తమ టాలెంట్ నిరూపించుకుంటూ ముందడుగు వేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఇంతకు ముందు మహిళలు పెళ్లి అయితే చాలు ఒక ఇంటికే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో దూసుకుపోతున్నారు.

Read More..

37 ఏళ్లుగా మూతపడ్డ థీమ్ పార్క్.. భయంతో వణుకుతున్న ప్రజలు..



Source link

Related posts

Snakes: పాములకు ఇది లక్ష్మణ రేఖతో సమానం.. ఇంటి చుట్టూ చల్లితే ఎంతటి విషసర్పమైనా పరార్..!

Oknews

మీ గ్యాస్ త్వరగా అయిపోతుందా.. ఈ టిప్స్ పాటించండి!

Oknews

జ్ఞాపకశక్తిని పెంచుతున్న హ్యాండ్ రైటింగ్..టైపింగ్‌కంటే ఎఫెక్టివ్‌గా..

Oknews

Leave a Comment