EntertainmentLatest News

మహేష్‌తో సినిమా అంటే డబ్బు వచ్చేస్తుందని అలా చేశారా?


మహేష్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే చాలు.. కాసులు బాగా రాలతాయని, కథ ఎలా ఉన్నా ఫర్వాలేదు అని త్రివిక్రమ్‌ అనుకొని వుండొచ్చు అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం చిత్రంలోని లోటు పాట్ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా గురించి గోపాలకృష్ణ  ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

‘ఒక్కమాటలో చెప్పాలంటే ‘గుంటూరు కారం’ అనే సినిమా మహేష్‌బాబు స్థాయి సినిమా కానే కాదు. 350కిపైగా సినిమాలకు పనిచేసిన నాకు గుంటూరుకారం సినిమా కథనం కాస్తంత గందరగోళంగా అనిపించింది. దీన్ని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకర్థం కాలేదు. బహుశా రెండోసారి చూస్తే ఈ విషయంలో నాకు క్లారిటీ వచ్చేదేమో. 2021లో మొదలైన ఈ సినిమా 2024లో విడుదలైంది. ఈ గ్యాప్‌లో కథ, కథనం విషయాల్లో యూనిట్‌ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు. త్రివిక్రమ్‌ మొదటి నుంచి తన సినిమాలకు చాలా మంచి టైటిల్స్‌ పెడుతూ వస్తున్నాడు. ఈ సినిమాకి పెట్టిన టైటిల్‌ మాత్రం తేడాగా ఉంది. సెంటిమెంట్‌ ప్రధానంగా సినిమా తియ్యాలనే ఉద్దేశం త్రివిక్రమ్‌కి ఉండి ఉంటే ఆ టైటిల్‌ రాంగ్‌. గుంటూరు అబ్బాయి అని టైటిల్‌ పెట్టి ఉంటే ఒక మంచి కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ఆడియన్స్‌ ముందే ఫిక్స్‌ అయి ఉండేవారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్‌ హీరో ఇంటికి వచ్చి అతన్ని ప్రేమలో పడెయ్యాలని ప్లాన్‌ చేస్తుంది. ఏ విధంగా చూసినా ఇది పాజిటివ్‌గా అనిపించదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్‌ చేసుకుంటూ వెళ్లి ఉంటే సినిమా మరోలా ఉండేది. త్రివిక్రమ్‌, మహేశ్‌ కాంబినేషన్‌ సినిమా కాబట్టి డబ్బు బాగా వస్తుందని ఆశించి ఉంటారు. అయితే డబ్బు కంటే ఒక మంచి సినిమా చూశామని ఆడియన్స్‌ చెబితే ఆ సంతృప్తే వేరు. ఇకపై చేసే సినిమా విషయంలోనైనా త్రివిక్రమ్‌ జాగ్రత్తలు తీసుకుంటాడని ఆశిస్తున్నాను’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.



Source link

Related posts

సలార్ డిస్ట్రిబ్యూటర్స్ కి  నిర్మాత డబ్బులని వెనక్కి ఇచ్చాడా!

Oknews

పాఠ్య పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా జీవిత చరిత్ర… పాకిస్థాన్ నుండి వచ్చిందిగా 

Oknews

Charan-Upasana anniversary pic with Klin Kaara క్లింకారతో చరణ్-ఉపాసన యానివర్సరీ పిక్

Oknews

Leave a Comment