హీరోల సినిమాల కోసం ఆ హీరోల అభిమానులు ఎదురు చూస్తుండటం సహజం. కానీ ఇప్పుడు ఒక హీరో సినిమా కోసం ఆ హీరో అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే కనీసం సినిమా నుంచి ఒక వాల్ పోస్టర్ వచ్చిన చాలు అనేలా ఎదురుచూస్తున్నారు. అలా వాళ్ళు ఎదురుచూస్తున్న హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఎదురు చూస్తున్న సినిమా గుంటూరు కారం. కానీ ఇప్పుడు గుంటూరు కారం మూవీ విషయం లో మహేష్ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు.
మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ గుంటూరు కారం. నెక్స్ట్ ఇయర్ జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియా లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ తో పాటు మహేష్ అభిమానులు షాక్ కి గురయ్యారు. ఎంతో పకడ్బంధీగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం మూవీ నుంచి ఫొటోస్ ఎలా బయటకి వచ్చాయని చిత్ర యూనిట్ ఆరా తీస్తుంది.
మహేష్ బాబు సరసన శ్రీ లీల ,మీనాక్షి చౌదరి లు హీరోయిన్ లు గా నటిస్తున్న గుంటూరు కారం మూవీ మీద మహేష్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. మహేష్ గత చిత్రం సర్కారు వారి పాట సినిమా వచ్చి సంవత్సరం దాటింది. ఆ సినిమా మహేష్ బాబు రేంజ్ కి తగ్గట్టుగా ఆడలేదు. 2022 లో ఆ సినిమా వచ్చింది. 2023 లో మహేష్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. దాంతో మహేష్ అభిమానులు గుంటూరు కారం మూవీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గుంటూరు కారం మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు లు సృష్టించాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి టైం లో ఇలా సినిమాకి సంబంధించిన స్టిల్స్ బయటకి లీక్ అవడంతో మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంకో సారి ఇలాంటివి రాకుండా చూడాలని చిత్ర నిర్మాతలని మహేష్ ఫాన్స్ కోరుకుంటున్నారు.