సూపర్ స్టార్ మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది. పైగా థియేటర్ల దగ్గర క్రౌడ్ ని చూస్తుంటే ఆ కలెక్షన్ల సునామి ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలు కూడా లేవని అర్ధం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల కూడా తన గుంటూరు కారంతో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న మహేష్ తాజాగా మరో రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు.
గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల అయ్యింది. అంటే బాబు థియేటర్స్ లో ల్యాండ్ అయ్యి ఒన్ వీక్ అవుతుంది. ఈ ఒన్ వీక్ లో అక్షరాలా 212 కోట్ల గ్రాస్ ని బాబు కొల్లగొట్టాడు. పైగా ఒక రీజనల్ సినిమా అంటే తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజైన ఒక మూవీ విడుదలైన తొలి వారమే ఆ స్థాయిలో కలెక్షన్ ని సాధించడం ఇదే ఫస్ట్ టైం. దీన్ని బట్టి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ మీద మహేష్ అజమాయిషీ చాలా బలంగా ఉంటుందని మరోసారి అర్ధం అయ్యింది. మహేష్ సాధించిన ఈ విజయంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ హుషారులో ఉన్నారు.
త్రివిక్రమ్ (trivikram) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా మొత్తాన్ని మహేష్ తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడు. డాన్స్,ఫైట్స్ తో పాటు తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ తో సిల్వర్ స్క్రీన్ పై వీర విహారం చేసి గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్ ని సాధించడానికి ప్రధాన కారణమయ్యాడు. తాజాగా టికెట్ రేట్స్ కూడా తగ్గించడంతో కలెక్షన్స్ లు మరింత పెరిగే అవకాశం ఉంది.దీంతో మరిన్ని రికార్డు లు మహేష్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ గుంటూరుకారం పూర్తిగా మహేష్ ఒన్ మాన్ షో.