EntertainmentLatest News

మహేష్-రాజమౌళి సినిమా గురించి అదిరిపోయే న్యూస్!


ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు.. తన తదుపరి సినిమాని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియానా జోన్స్‌ తరహాలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ మూవీ కోసం ప్రస్తుతం మహేష్ మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.

మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉందని పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఇండోనేషియ‌న్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ని రాజమౌళి రంగంలోకి దింపుతున్నట్లు కూడా న్యూస్ వినిపించింది. ఇప్పుడు ఆ న్యూస్ నిజమని తెలుస్తోంది. ‘SSMB 29’లో చెల్సియా నటించడం ఫిక్స్ అయిందని సమాచారం. అంతేకాదు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. త్వరలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారట.



Source link

Related posts

TFI will show the show to Jagan జగన్ కి షో చూపించనున్న TFI

Oknews

Bajireddy Govardhan,Loksabha Elections,Nizamabad, Brs, Bjp, Telangana, Dharmapuri Arvind

Oknews

అల్లు అర్జున్ ని అఖిల్ ఫాలో అవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటి! 

Oknews

Leave a Comment