Uncategorized

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్, రెండు కేసులు నమోదు-anakapalle police notice ex minister bandaru satyanarayana objection comments on minister roja ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చివరికి అరెస్టు

గుంటూరు పోలీసులు నోటీసులతో బండారు సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు… ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బండారుకు బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉండడంతో… పోలీసులు బండారు ఇంట్లోనే వేచిచూసి, చివరకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బండారు ఇంటికి చేరుకున్న టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు… పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు ఎక్కడపడితే అక్కడ 144 సెక్షన్‌ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ భార్య పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులు, మహిళా కమిషన్ ఏమైపోయిందని మండిపడ్డారు. మంత్రి రోజాకు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.



Source link

Related posts

Minister Roja: అంతా ఖండిస్తున్నారు కానీ సొంత పార్టీలో స్పందనేది?

Oknews

వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?-the pros of a tdp janasena alliance in andhra pradesh political analysis by peoples pulse ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రైల్వే స్టేషన్ లోకి ఏనుగు ఎంట్రీ, రైలు రాలేదని అలిగి అడవిలోకి!-parvathipuram elephant roaming in railway station at midnight video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment