Attack On Mla Shankar Narayana : మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకర్ నారాయణ కారుపై పేలుడు పదార్థాలతో దాడికి యత్నించాడు. అయితే అవి పేలకపోవటంతో శంకర్ నారాయణకు పెను ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో శంకర్ నారాయణ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ తన సిబ్బందితో కలిసి కారులో వెళ్తుండగా దుండగుడు డిటోనేటర్ విసిరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే శంకర్ నారాయణపై డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు. పవర్ సప్లై లేకపోవడంతో ఆ డిటోనేటర్ పేలలేదన్నారు. మద్యం మత్తులో యువకుడు డిటోనేటర్ విసిరినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగుడు గణేష్ సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానితి చెందినవాడని పోలీసులు గుర్తించారు.