తెలుగు వారి అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)నాలుగున్నర దశాబ్డల నుంచి ఆయన సినీ ప్రస్థానం కొనసాగుతు ఉందంటే చిరు స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం విశ్వంభర మూవీని చేస్తున్నాడు. షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు అక్కడకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక మంత్రి వెళ్లడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
కందుల దుర్గేష్(kandula durgesh)మొన్న జరిగిన ఏపి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ తో గెలుపొందాడు. దీంతో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యాడు. తాజాగా విశ్వంభర సెట్ కి వచ్చి చిరంజీవిని కలిసాడు. ఈ విషయాన్ని చిరు తన ఇనిస్టాగ్రమ్ వేదికగా తెలిపాడు. మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంభర సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలి. అదే విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడంతో పాటు సవాళ్లను కూడా సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరాను. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే విశ్వసిస్తున్నాను అని కూడా తెలిపారు.మంత్రికి శాలువా కప్పి పుష్ప గుచ్చం కూడా అందచేసాడు.
ఇక దుర్గేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందే చిరంజీవిని కలవడం పట్ల సినీ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి మంచి రోజులు వచ్చినట్టే అని కూడా అంటున్నారు.ఎందుకంటే గత ప్రభుత్వ చర్యల వల్ల సినిమా ఇబ్బందులు పడిన విషయం అందరకి తెలిసిందే. అందుకోసం అప్పటి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని చిరు తో పాటు నాగార్జున, మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి ప్రముఖులు కలిశారు. ఆ సందర్భంలో చిరు ముఖ్యమంత్రికి నమస్కారం చేసాడు. కానీ జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సినిమా మంత్రే చిరంజీవి దగ్గరకి వెళ్ళాడు. . చిరు అభిమానులు అయితే ఇది మా బాస్ రేంజ్ అంటున్నారు.