EntertainmentLatest News

మార్కెట్ మహాలక్ష్మీ సినిమా టీమ్ వినూత్న పబ్లిసిటి.. ఆ పేరుంటే చాలంట!


తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజవుతుంది. అందులో ఈ నెల 29న కేరింత ఫేమ్ పార్వతీశం నటించిన ‘మార్కెట్ మహాలక్ష్మి’ విడుదల కానుంది‌. 

కేరింత సినిమాలో శ్రీకాకుళం యాసతో అందరికి కనెక్ట్ అయిన పార్వతీశం.. ఆ సినిమా తర్వాత ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు చేసిన అవి పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న పార్వతీశం ‘మార్కెట్ మహాలక్ష్మీ’ తో ప్రేక్షకుల ముందుకు‌ వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో ఆసక్తిని పెంచేశారు మేకర్స్. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్ణి సారించారు. అందులో భాగంగా మహాలక్ష్మీ అనే పేరు‌‌ గల వాళ్ళు మీ ఇంట్లో అమ్మ గానీ, చెల్లి గానీ, అక్క గానీ ఉంటే ఆ పేరుతో ఉన్న ఐడి కార్డుని తోసుకొస్తే ఉచితంగా టికెట్ ఇస్తామని హీరో పార్వతీశం, హీరోయిన్ గా ఐశ్వర్య తమ ఇన్ స్ట్రాగ్రామ్ ఐడీలలో పోస్ట్ చేశారు. అయితే మహాలక్ష్మీ పేరుతో గల ఐడీని 9005500559 నెంబర్ కి వాట్సప్ చేయమని చెప్పారు. 


సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే పార్వతీశం..మార్కెట్ లో మహాలక్ష్మీ అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు.  మహాలక్ష్మీకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. దాంతో తన చెంపపగులగొడుతుంది‌. మహాలక్ష్మీతో మజాక్ చేస్తే మంచిగుండదని హీరోయిన్ మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక అదే విషయం తన ఆఫీస్ కొలీగ్ తో చెప్పగా.. అయిన కూరగాయలమ్మే దాన్ని ఎలా లవ్ చేశావురా అంటు అతను అనగా ట్రైలర్ ముగుస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ మూవీ ట్రైలర్ చూశారు. 29 న విడుదల కానున్న ఈ సినిమాకి వెళ్తున్నారా లేదా కామెంట్ చేయండి.

 



Source link

Related posts

ఇలా ఇరుక్కుపోయావేమిటి జగన్

Oknews

ఇక తెలుగు సినిమా గద్దర్ అవార్డుతో మురిసిపోనుంది 

Oknews

విశ్వక్ సేన్ సవాలు..మరి హీరోలు ఏం చేస్తారో చూడాలి

Oknews

Leave a Comment