హుండీ ఆదాయంహనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma)హుండీల ఆదాయం లెక్కించారు. మొత్తం 317 హుండీలను లెక్కించగా రూ.9.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం నాలుగో రోజు లెక్కింపులో… 88 ఐరన్ హుండీలు విప్పి కానుకలు లెక్కించారు. ఈ హుండీల్లో రూ.71.67 లక్షల ఆదాయం లభించింది. నాలుగో రోజు లెక్కింపుతో కలిపి మొత్తం 405 హుండీల్లో రూ.10,32,03,000 ఆదాయం(Medaram Hundi Counting) వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశామని మేడారం ఈవో రాజేంద్రం వెల్లడించారు.
Source link