Telangana

మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి-కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థినుల సూసైడ్ నోట్-yadadri news in telugu bhongir school students committed suicide due to upset over other students complaint ,తెలంగాణ న్యూస్



చెయ్యని తప్పుకు నిందించారు”మేం వెళ్లిపోతున్నందుకు అందరు మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేయకపోయినా అందరు మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవ్వరు నమ్మలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఇలా వెళ్లిపోతున్నాం. మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి” అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు, పాఠశాల యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు విషయం వెల్లడించకుండా హాస్పిటల్ కు మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు విద్యార్థినులు ఈ ఘాతుకానికి పాల్పడుతుంటే హాస్టల్ సిబ్బంది ఎక్కడికి వెళ్లారని మృతుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. హాస్టల్ వార్డెన్ శైలజ తో పాటు ట్యూషన్ టీచర్ ను భువనగిరి పోలీసులు విచారిస్తున్నారు. కాగా హాస్టల్లో జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని డీఈవో తెలిపారు. భావ్య, వైష్ణవి తమను దూషించి చేయి చేసుకున్నారని నలుగురు విద్యార్థినులు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పడంతో వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ తప్పేమీ లేకపోయిన తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించిన విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.



Source link

Related posts

AP ections 2024 Date | Telangana Election Shedule | AP ections 2024 Date | Telangana Election Shedule | తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఆ రోజే

Oknews

Amit Shah Announces Telangana CM Candidate : సూర్యపేట సభలో అమిత్ షా కీలక ప్రకటన | ABP Desam

Oknews

AP Elections 2024 | Eelctions Shedule | AP Elections 2024

Oknews

Leave a Comment