EntertainmentLatest News

మా పెళ్లి అయిపోయింది.. కానీ దాని గురించే ఆలోచిస్తున్నాను


2013 లో రాజ్ తరుణ్ (raj tatun)హీరోగా వచ్చిన ఉయ్యాలా జంపాలా తో అవికా గోర్(avika gor)తెలుగు వారి అభిమాన హీరోయిన్ గా  మారింది. అంతకు ముందే  అత్యంత  చిన్న వయసులోనే చిన్నారి పెళ్లి కూతురుతో  ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని కూడా పొందింది. లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, రాజు గారి గది 3 ,పాప్ కార్న్, ఉమాపతి, హర్రర్స్ ఆఫ్ హార్ట్ వంటి చిత్రాలతో పాటు పలు  వెబ్ సిరీస్ లోను చేస్తు తన హవాని చాటుతుంది. లేటెస్ట్ గా విజయం సాధించిన వధువు నే అందుకు ఉదాహరణ. ఇక లేటెస్ట్ గా  తన ప్రియుడు గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి  హాట్ టాపిక్ గా మారాయి. 

అవికా ప్రెజంట్ హిందీ లో బ్లడీ ఇష్క్(bloody ishq)అనే మూవీ చేస్తుంది. ఈ నెల 26 న డిస్ని హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొన్న అవికా  తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలని వెల్లడి చేసింది. మిలంద్ చాంద్వాని(milind chandwani)అంటే నాకెంతో ఇష్టం. ఆరు నెలల పాటు స్నేహితులుగా ఉన్నాం. ఆ తర్వాత ఒక రోజు మిలంద్ నే పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. ఇద్దరి ఇష్ట ఇష్టాలు కూడా కలిసాయి. నా అభిప్రాయాలకు చాలా గౌరవం ఇస్తాడు. అందుకే ప్రేమ ప్రతిపాదనతో వచ్చినప్పుడు అంగీకరించా. ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా మా పెళ్లి అయిపోయింది. పెళ్లి గురించి మేము చాలు సార్లు చర్చించుకున్నాం అని చెప్పింది.

 కాకపోతే ఇంకొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.  వయసు రీత్యా మా ఇద్దరు ఆమధ్య చాలా వ్యత్యాసం ఉంది.  ఆ విషయంలో నన్ను ఆలోచించుకోమని  మిలంద్  చెప్పాడు.  అందుకే అలోచిస్తున్నానని కూడా  చెప్పింది.ఇక మిలంద్ కి  సినిమా రంగానికి ఎటువంటి  సంబంధం లేదు.   కామన్ ఫ్రెండ్స్  ద్వారా అవికా కి  పరిచయమయ్యాడు.

 



Source link

Related posts

Congress in TS.. The survey is telling the truth..! TS కాంగ్రెస్.. సర్వే చెబుతున్న సత్యం!

Oknews

Kalki arrived on time కల్కి అనుకున్న సమయానికే ఆగమనం

Oknews

మార్చిలో మోతే.. ఇది కదా విజయ్ సినిమా అంటే…

Oknews

Leave a Comment