ఇండస్ట్రీలో కాక రేపే కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయనే కెరీర్ మోడల్ గా మొదలుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆకాష్ పూరి హీరోగా విడుదలైన “రొమాంటిక్” మూవీతో పరిచయం చేసాడు. కేతిక, ఆకాష్ పూరి సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశారు. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది. నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సెకండ్ మూవీ లక్ష్యలో చేసింది. అది కూడా కేతికాకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. రంగరంగ వైభవంగా మూవీతో మూడోసారి మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించింది కానీ అది కూడా ప్లాప్.
అయినప్పటికీ అమ్మడు అందంతో ఎలాంటిదో ఈ మూవీస్ లో చూసిన డైరెక్టర్స్ ఆమెకు పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఉత్తరాది భామ ఐనప్పటికీ తన అందచందాలతో ఫాన్స్ ని పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. రీసెంట్ గా కొంతమంది ఫాన్స్ ఆమెను పొగిడే పని పెట్టుకున్నారు. ఆ పొగడడం కూడా చాల గమ్మత్తుగా, క్యూట్ గా ఉంది. ఇంకేముంది కేతిక కూడా ఆ పొగడ్తకు ఫిదా ఐపోయింది. ఇంతకు ఎం పొగిడారు అనుకుంటున్నారా “”మీలోని లోపాల సంఖ్యను చూసి ఆర్యబట్ట 0 ని కనిపెట్టి ఉంటాడు.” ఇక ఈ వన్ లైనర్ ని చూసిన కేతిక “ఎలా అబ్బా ఇంత అందంగా వన్ లైన్ లో పొగడగలిగారు.
ఇలాంటి ఆలోచన వచ్చినందుకు నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది. నాకు కూడా ఈ లైన్ నచ్చింది. థ్యాంకు..లవ్ యు ఆల్. ఉంటా” అని చెప్పి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ట్రెడిషనల్ వేర్ దగ్గర నుంచి అప్ డేట్ మోడర్న్ డ్రెస్సుల వరకు అన్నీ వేసుకుని తన అందచందాలను ఆరబోస్తుంది కేతిక .