దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది మద్యం సేవిస్తూనే ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటారు కొందరు.ప్రస్తుతం ఉన్న యూత్ కూడా ఎక్కవగా బీర్‌లు బ్రాందీ తాగుతుంటారు. అయితే మద్యం తాగడం వలన లివర్ క్యాన్సర్, పచ్చకామెర్లు లాంటి వ్యాధులు వస్తాయని చెబుతారు వైద్యులు. కానీ ఇవన్నీ లెక్క చేయకుండా అందరూ మద్యం సేవిస్తూనే ఉంటున్నారు.
అయితే బ్రాందీ, రమ్ తాగడం వలన జలుబు, దగ్గు తగ్గుతుందంట.జలుబు, ఫ్లూకి బ్రాందీ బ్రాందీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయంట. శ్లేష్మంను శుభ్రం చేయడంలో తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇవి జలుబు, దగ్గు తగ్గేలా చేస్తుందంట.