మీడియా సంస్థలు ప్రెస్ మీట్ పెడితే.. Great Andhra


ఆంధ్ర మాజీ సిఎమ్ జ‌గన్ మీద ఓ విమర్శ వుంది. ఆయన ఎప్పుడూ మీడియాతో ముచ్చటించరు. ఇంటర్వూలు ఇవ్వరు. గడచిన అయిదేళ్ల ఆయన పాలన ఇలాగే సాగింది. ఇప్పుడు అలాగే వున్నారు. సరే, జ‌గన్ కు మీడియా ఫోబియా అనుకుందాం. మీడియా ముందుకు ఎప్పుడూ రాజ‌కీయ నాయకులే రావాలా? మీడియా ముందుకు మీడియా రావచ్చు కదా.

సపోజ్, ఫర్ సపోజ్ మన దగ్గర తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వున్న రెండు దిన పత్రికలు కావచ్చు, రెండు మూడు చానెళ్లు కావచ్చు, రెండు మూడు డిజిటల్ మాధ్యమాలు కావచ్చు.. మీడియా ముందుకు వస్తే… ఎలా వుంటుంది. ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి?

# జ‌గన్ పాలన అయిదేళ్లలో, వంద రూపాయలు అప్పు తెచ్చినా ఫ్రంట్ పేజీ వార్త అయింది కదా.. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పుల వైనాలు మీ మీ మీడియాలో కనిపించకుండా దాచేస్తున్నారు. ఇలా చేయడం మీడియా లక్షణమా?

# జ‌గన్ పాలన అయిదేళ్లలో, ఏ మూల ఏ నేరం జ‌రిగినా దానికి జ‌గన్ పాలనకు ముడిపెట్టి, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ, చిలువలు పలవులగా కవిత్వం జోడంచి, వార్తలు వండి వార్చారు కదా.. మరి ఇప్పుడు ఎందుకు వాటిని వీలయినంత టోన్ డౌన్ చేస్తున్నారు?

# చంద్రబాబు నేరుగానే హోమ్ మంత్రి మరింత చురుగ్గా పని చేయాలని కామెంట్ చేసారు. అదే జ‌గన్ టైమ్ లో జ‌గన్ అలా కామెంట్ చేసి వుంటే, ఎలాంటి హెడ్డింగ్ పెట్టి వుండేవారు.

# ఎమ్మెల్యే శ్రీనివాసరావు గుంతల మయమైన రోడ్ల మధ్య స్టూల్ వేసుకుని కూర్చుంటే అధికారుల తీరు మీద నిరసన అన్నట్లు ప్రొజెక్ట్ చేసి ఊరుకున్నారు. అదే జ‌గన్ హయాంలో ఓ ఎమ్మెల్యే రోడ్ల తీరు మీద అలా చేసి వుంటే మీరు ఎలా ప్రొఙెక్ట్ చేసేవారు.

# ఫ్రీ ఇసుక తరువాత రేటు పెరిగిన సంగతి మీ దృష్టికి వచ్చిందా?లేదా? మరి దానిని మీ విలేకరుల బృందం చేత ఎందుకు సర్వే చేయించి సవివరమైన వార్తా కథనం ప్రచురించరు?

# ఓ మంత్రి ఎవరికీ తెలియకుండా విదేశాలకు వెళ్లిన వైనం కనుక జ‌గన్ ప్రభుత్వ హయాంలో జ‌రిగి వుంటే మీ మీడియా ఎలా స్పందించేది. రాష్ట్రంలో వరదల బీభత్సం నెలకొన్న టైమ్ లో సదరు మంత్రి కనీసం ప్రకటన కూడా చేయకుండా వున్నారు. ఇదే జ‌గన్ పాలనలో ఙరిగి వుంటే మీ మీడియా ఎలాంటి కథనాలు వండి వార్చేది?

# మద్య నిషేధం చేస్తానని చెప్పి జ‌గన్ చేయలేదని అయిదేళ్ల పాటు మీరు యాగీ చేసారు. వాలంటీర్లకు పదివేలు జీతం, మహిళలకు బస్ ఫ్రీ ఇలా చాలా హామీల గురించి ప్రశ్నించడం ఎప్పుడు మొదలుపెడతారు.

ఇలా చాలా ప్రశ్నలకు ఈ మీడియా సంస్థలు బదులు ఇవ్వాల్సి వుంది.

మీడియా అంటే ప్రశ్నించడమే కాదు.. జ‌వాబులు కూడా చెప్పాలి. కానీ మన దగ్గర దురదృష్ట వశాత్తూ బురద వేయడానికి మాత్రమే మీడియా పనికి వస్తుంది.



Source link

Leave a Comment