EntertainmentLatest News

మీరు అనుకున్నదే నిజం.. జేజమ్మ ఆ డైరెక్టర్ తో ఇక పక్కా!


హీరోలతో పాటు సమానమైన ఇమేజ్ ని సంపాదించిన హీరోయిన్లలో అనుష్క కూడా ఒకటి. రెండు దశాబ్దాల క్రితమే తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి  నేటికీ తన అధ్బుతమైన నటనతో  ప్రేక్షకుల దృష్టిలో ఫేవరేట్ హీరోయిన్ గా ఉంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలని పోషించిన ఆమెని  ప్రేక్షకులు అరుంధతి నుంచి  జేజమ్మ గా పిలుచుకుంటు వస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జేజమ్మ చెయ్యబోయే సినిమా గురించి రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా జేజమ్మ  చెయ్యబోయే సినిమా విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.

అనుష్క తన నూతన చిత్రాన్ని ప్రముఖ  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో చెయ్యబోతుందనే  వార్తలు గత  కొన్ని రోజుల నుంచి  వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తు వీళ్లిద్దరి కాంబోలో సినిమా  ఓకే అయ్యిందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. అనుష్క తన హోమ్ బ్యానర్ లా భావించే యూవీ క్రియేషన్స్ సంస్థ ఆ ఇద్దరి సినిమాకి నిర్మాణ సారథ్యం వహించనుందని మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే  తెలియనున్నాయని కూడా అంటున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క చెయ్యబోయే సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి  వేళ ఇప్పుడు ఈ వార్తలతో అనుష్క అభిమానులు ఫుల్ హ్యాపీతో ఉన్నారు. అలాగే క్రిష్ అనుష్క ల కాంబినేషన్ లో గతంలో వేదం మూవీ వచ్చి చాలా పెద్ద విజయం సాధించింది.అలాగే ఆ మూవీ అనుష్క నటనలో దాగి ఉన్న కొత్త కోణాన్ని బయటకి తీసి తన అభిమాన గణాన్నిపెంచుకునేలా కూడా చేసింది.



Source link

Related posts

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra వీళ్లనెవరికైనా చూపించండిరా..!

Oknews

'లూటేరే' వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

Shiva balakrishna: ఏసీబీ కోర్టులో రెరా కార్యదర్శి శివబాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌

Oknews

Leave a Comment