Entertainment

మీరు అలా చేసినందుకే అనుపమ ఈ ఫంక్షన్‌కి రాలేదు..  క్లారిటీ ఇచ్చిన సిద్ధు!


సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టిల్లు స్క్వేర్‌’. ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ ఫంక్షన్‌కు యూనిట్‌ మొత్తం హాజరైంది. కానీ, అనుపమ పరమేశ్వరన్‌ మాత్రం అటెండ్‌ అవ్వలేదు. 

దీనిపై హీరో సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇస్తూ ‘ఈ ఫంక్షన్‌కి అనుపమ రాకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ సినిమాకి సంబంధించి నిన్న ఒక పోస్టర్‌ రిలీజ్‌ అయింది. ఆ పోస్టర్‌లోని హ్యాండ్‌ పొజిషన్‌ చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్‌ చేశారు. సెలబ్రిటీస్‌ గురించి సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ చేయడం నేచురలే. దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఒక అమ్మాయి గురించి కామెంట్‌ చేసేటపుడు కొన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇది నేను మీకు ఆర్డర్‌ వేయడం లేదు. ఒక రిక్వెస్ట్‌గా చెబుతున్నాను. ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినపుడు ఆమెను ఫ్లర్ట్‌ చేస్తే అది ఆ అమ్మాయి కూడా ఎంజాయ్‌ చేసేలా ఉండాలి తప్ప బాధ పెట్టేదిగా ఉండకూడదు. ఆ అమ్మాయి ఇబ్బంది పడితే మనకి కూడా పని జరగదు. అనుపమ విషయానికి వస్తే.. ఇది చాలా సెన్సిటివ్‌. రాసింది నిజంకాదు, అక్కడ చూసింది నిజం కాదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండి ఏ పనీ లేకపోతే వచ్చే కామెంట్స్‌ అవి. నా రిక్వెస్ట్‌ ఏమిటంటే.. ఇలాంటి విషయాల్లో కొంచెం హెల్దీ ఎట్మాస్ఫియర్‌ మెయిన్‌టెయిన్‌ చేద్దాం’ అన్నారు. 



Source link

Related posts

Rev1 spots investment opportunities sooner while cutting research time in half

Oknews

లోకేష్ టార్గెట్ వెయ్యి కోట్లు!

Oknews

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా హీరో వెంకటేష్ వియ్యంకుడు!

Oknews

Leave a Comment